Moviesపూజా హెగ్డేను పెళ్లాడ‌తాన‌న్న బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్‌... మోనాల్ రెండో పెళ్లాం...

పూజా హెగ్డేను పెళ్లాడ‌తాన‌న్న బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్‌… మోనాల్ రెండో పెళ్లాం అట‌

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి లైఫ్ఈజ్ బ్యూటీఫుల్ ఫేం అభిజిత్ ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జున‌తో కాసేపు ముచ్చ‌టించిన అభిజిత్ లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాలో నాగార్జున వైఫ్ అమ‌ల‌తో క‌లిసి న‌టించిన అనుభూతులు కాసేపు పంచుకున్నాడు. ఆ త‌ర్వాత అభిజిత్ తాను పెళ్లిగోల వెబ్‌సీరిస్‌లో న‌టించాన‌ని చెప్ప‌గా నీ పెళ్లి ఎప్పుడు అని ప్ర‌శ్నించాడు. సార్ మీరు ఆ మాట ఎత్త‌వ‌ద్దు.. న‌న్ను ఇంట్లో వాళ్లు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు ?  కనీసం బిగ్‌బాస్‌లో అయినా ఎవ‌రిని అయినా చూసుకునా ? అని అన్నార‌ని స‌రాదాగా జోక్ చేశాడు.

ఇక నాగ్ అభిజిత్‌కు చిన్న క్విజ్ పెట్టాడు.. ముందుగా ముగ్గురు హీరోయిన్ల పేర్లు చెప్పి వీరిలో ఎవ‌రిని పెళ్లి చేసుకుంటావు ?  ఎవ‌రితో డేట్‌కు వెళ‌తావు ?  ఎవ‌రిని ముద్దు పెట్టుకుంటావ‌ని ప్ర‌శ్నించాడు. దీనికి అభిజిత్ ఆన్స‌ర్ ఇస్తూ పూజా హెగ్డేను పెళ్లి చేసుకుని.. త‌మ‌న్నాను ముద్దు పెట్టుకుని.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో డేట్ చేస్తాన‌ని చెప్పాడు.

ఇక మ‌రో ఫొటోలో ఉన్న ముగ్గురు అంద‌గ‌త్తెలు అయిన హీరోయిన్ల‌ను చూపిస్తూ హౌస్‌లోకి వెళ్లిన మోనాల్ గ‌జ్జ‌ర్ సంప్ర‌దాయ దుస్తుల్లో ఉండ‌డంతో ఆమెను పెళ్లి చేసుకుంటాన‌ని.. రాశీఖ‌న్నాతో డేట్ చేస్తాన‌ని.. న‌భా న‌టేష్‌ను ముద్దు పెట్టుకుంటాన‌ని చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news