Moviesతండ్రి నుంచి ప్రాణ‌హానీ.. పోలీసుల‌కు కంప్లైంట్ చేసిన న‌టి

తండ్రి నుంచి ప్రాణ‌హానీ.. పోలీసుల‌కు కంప్లైంట్ చేసిన న‌టి

బాలీవుడ్ సీరియల్ నటి తృప్తి శంఖధార్ (19) తన తండ్రి నుంచే ప్రాణ‌హానీ ఉంద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం క‌ల‌క‌లంగా మారింది. ఆమె త‌న‌కు తండ్రి రామ్ రతన్ శంఖధార్‌తో ప్రాణ‌హానీ ఉందంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. త‌న త‌ల్లితో క‌లిసి త‌న‌ను రక్షించాల‌ని కూడా ఆమె త‌న ఇన్‌స్ట్రాగ్రామ్ వేదిక‌గా వేడుకుంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. త‌న తండ్రి త‌న‌కు ఇష్టంలేని అబ్బాయితో త‌న‌కు పెళ్లి చేయాల‌ని చూస్తున్నాడ‌ని కూడా త‌న ఫిర్యాదులో పేర్కొంది.

ఇక పోలీసులు తాను ఫిర్యాదు చేసినా స్వీక‌రించ‌లేద‌ని… ద‌య‌చేసి నాకు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఆమె వేడుకుంటోంది. అయితే పోలీసుల వెర్ష‌న్ మాత్రం మ‌రోలా ఉంద‌ని.. త‌మ‌కు ఆ న‌టి నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేద‌ని.. సోషల్ మీడియాలో నటి పోస్ట్ గురించి తెలుసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని బరేలీ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇకపోతే తృప్తి శంఖధార్ ప్రస్తుతం టిక్ టాక్ స్టార్  కిరణ్  హీరోగా తెరకెక్కుతున్న ఓయ్  ఇడియట్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news