Gossipsస్టార్ హీరోకు విల‌న్‌గా త‌మ‌న్నా... ఆ క్రేజీ సీక్వెల్లో లేడీ విల‌న్‌గా...

స్టార్ హీరోకు విల‌న్‌గా త‌మ‌న్నా… ఆ క్రేజీ సీక్వెల్లో లేడీ విల‌న్‌గా ఫిక్స్‌..!

సౌత్ ఇండియా క్రేజీ కాంబినేషన్స్ లో ఇళయదళపతి విజయ్ – డైరెక్టర్ మురగదాస్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీరిద్దరి కలయికలో వ‌చ్చిన మూడు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. తుపాకీ, క‌త్తి, స‌ర్కార్ మూడు సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు వీరి కాంబోలో మ‌రో సినిమా వ‌స్తోంది. ఇదే తుపాకీ సీక్వెల్‌. తుపాకీకి సీక్వెల్‌గా వ‌స్తోన్న ఈ సినిమా స్టోరీ కూడా ఇప్ప‌టికే మురుగ‌దాస్ రెడీ చేశార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌మీద‌కు వెళ్ల‌నుంది.

సన్ పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమా పట్టాలెక్కనుంద‌ని… ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా కూడా నటించబోతుందని తెలుస్తోంది. అది కూడా త‌మ‌న్నా నెగిటివ్ రోల్‌లో క‌నిపించ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. త‌మ‌న్నా ఇప్ప‌టికే సైత్‌లో అంద‌రు స్టార్ హీరోల‌తోనూ నటించింది. అయితే ఇప్పుడు వ‌య‌స్సు పైబ‌డ‌డంతో ఆమెకు సీనియ‌ర్ హీరోల ప‌క్క‌న ఛాన్సులు త‌క్కువుగా వ‌స్తున్నాయి. అయితే ఇప్పుడు తుపాకీ సీక్వెల్‌లో బ‌ల‌మైన లేడీ విల‌న్ రోల్‌ను మురుగ‌దాస్ ఆమెకు ఆఫ‌ర్ చేశార‌ట‌.

తుపాకీ 2లో తమన్నా పాకీస్థానీ స్పైగా కనిపించబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇటీవ‌ల స్టార్ హీరోయిన్లు నెగిటివ్ రోల్లో క‌నిపించేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. సమంత అక్కినేని కూడా  సిరీస్ కోసం నెగెటివ్ రోల్ లో కనిపించనుంది. మరి ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఈ ఛాలెంజింగ్ రోల్ లో మెప్పిస్తుందేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news