Moviesఎవ్వ‌రూ ఊహించ‌ని విల‌న్ రోల్‌లో ఆంటీ హీరోయిన్‌...!

ఎవ్వ‌రూ ఊహించ‌ని విల‌న్ రోల్‌లో ఆంటీ హీరోయిన్‌…!

సీనియ‌ర్ న‌టి మీనా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.  తెలుగు, తమిళ, క‌న్న‌డ‌, మలయాళ‌ సినీ ఇండ‌స్ట్రీల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న మీనా.. బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసింది. ఆ త‌ర్వాత స్టార్ హీరోలంద‌రితో జ‌త క‌ట్టిన ఈమె..  దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా కొన్నాళ్ల పాటు చ‌క్రం తిప్పింది. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లందరూ చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ కొనసాగిస్తుంటే మీనా మాత్రం ప్ర‌ధాన పాత్రల్లో న‌టిస్తోంది. చివ‌ర‌గా ఆమె విక్ట‌రీ వెంక‌టేష్ ప‌క్క‌న దృశ్యం సినిమాలో సాక్ష్యం సినిమాలో హీరో త‌ల్లి పాత్ర‌లో న‌టించింది.

ఇక మీనా వెబ్‌సీరిస్ వైపు కూడా అడుగులు వేస్తున్నాడు. జీ5లో ప్రాస‌ర‌మైన క‌రోలిన్ కామాక్షి అనే వెబ్ సీరిస్ ద్వారా ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఇక ఇప్పుడు వెండితెర‌పై మ‌ళ్లీ స‌త్తా చాటేందుకు రెడీ అవుతోన్న మీనా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌ల్లో అయినా న‌టించేందుకు సిద్ధ‌మ‌ని సంకేతాలు ఇచ్చేసింది. స‌త్తా ఉన్న రోల్స్ ఉంటే విల‌న్ పాత్ర‌ల్లో అయినా చేస్తాన‌ని కూడా చెపుతోంది.

ఇప్ప‌టికే సీనియ‌ర్ హీరోయిన్లు ర‌మ్య‌కృష్ణ‌, సిమ్రాన్ లాంటి వాళ్లు నెగిటివ్ రోల్స్ ఉన్న పాత్ర‌లు చేశారు. ఈ పాత్ర‌ల్లో న‌టించినందుకు వారికి మంచి పేరు కూడా వ‌చ్చింది. ఇక నేటి త‌రం హీరోయిన్ల‌లో త్రిష‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్, ఆండ్రియా లాంటి వాళ్లు కూడా నెగిటివ్ రోల్స్‌లో మెప్పించేందుకు ప్ర‌య‌త్నించారు. మ‌రి ఇప్పుడు మీనా కూడా ఆంటీ వ‌య‌స్సులో విల‌న్ రోల్స్ చేసి ఎంత వ‌ర‌కు మెప్పిస్తుందో ?  చూడాలి. ఆమె ప్రస్తుతం మలయాళంలో దృశ్యం 2 మరియు తమిళ్ లో రజినీకాంత్ సరసన అన్నాత్తే సినిమాల్లో న‌టిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news