Moviesబ్రేకింగ్‌: అత‌డితో నా పెళ్లి... శ్రీరెడ్డి సంచ‌ల‌నం

బ్రేకింగ్‌: అత‌డితో నా పెళ్లి… శ్రీరెడ్డి సంచ‌ల‌నం

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఉదంతంతో శ్రీరెడ్డి క్రియేట్ చేసిన సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పైనే కాకుండా ఎంతో మందిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. ఈ క్ర‌మంలోనే ద‌గ్గుబాటి ఫ్యామిలీకి చెందిన సురేష్‌బాబు త‌న‌యుడు అభిరాంపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. తాజాగా మ‌రోసారి శ్రీరెడ్డి అభిరాంపై రెచ్చిపోయింది. ద‌గ్గుబాటి రానా త‌న ప్రియురాలు మిహీకా బ‌జాజ్‌ను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ పెళ్లిపై స్పందించిన శ్రీరెడ్డి ఓ వైపు రానాకు పెళ్లి విషెస్ చెపుతూనే మ‌రోవైపు నీ త‌మ్ముడు అభిరాంతో నా పెళ్లి ఎప్పుడు ? అంటూ కౌంట‌ర్ వేసింది.

 

మీ త‌మ్ముడితో నా పెళ్లి జ‌ర‌క్క‌పోయినా ప‌ర్వాలేదు.. కానీ నాలా మ‌రో ఆడ‌పిల్ల జీవితం నాశ‌నం చేయ‌వ‌ద్ద‌ని సూచించింది. ఇప్ప‌ట‌కి అయినా అయ్యిందేదో అయ్యింది.. మీ త‌మ్ముడిని కంట్రోల్లో పెట్టుకోమ‌ని ఓ స‌ల‌హా కూడా ఇచ్చేసింది. అలాగే గ‌తంలో తాను ద‌గ్గుబాటి ఫ్యామిలీతో సెటిల్‌మెంట్ చేసుకుని సైలెంట్ అయ్యాన‌న్న వారికి కూడా కౌంట‌ర్ ఇచ్చింది. శ్రీరెడ్డి గ‌తంలో ద‌గ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్ చేయ‌కుండా ఉండేందుకు వాళ్ల ద‌గ్గ‌ర రు. 6 కోట్లు తీసుకుని చెన్నైకు మ‌కాం మార్చేసింద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

 

అయితే ఇప్పుడు వీటిని ఖండించిన శ్రీరెడ్డి త‌న త‌ల్లి తోడుగా వారి ద‌గ్గ‌ర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేద‌ని.. ఇక నేను డ‌బ్బులు తీసుకున్నాన‌ని చెప్పిన కుక్క‌ల మాట‌లు తాను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని సెటైర్ వేసింది. పేరు ప‌ర‌ప‌తి ఉన్న ఫ్యామిలీల‌కు ఏవైనా చెల్లుబాటు అవుతుంద‌ని… అన్యాయం అయ్యేవాళ్లు మాత్రం అవుతూనే ఉన్నార‌ని చెప్పింది. మొత్తానికి శ్రీరెడ్డి ద‌గ్గుబాటి ఫ్యామిలీని వ‌దిలేలా లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news