Moviesశృంగారంపై పూరి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు... వామ్మో ఇంత డేరింగ్‌గానా..!

శృంగారంపై పూరి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు… వామ్మో ఇంత డేరింగ్‌గానా..!

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఫైట‌ర్ సినిమా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే పూరి త‌న తాజా ఇంట‌ర్వ్యూలో శృంగారం గురించి మ‌రీ ఓపెన్‌గానే మాట్లాడేసి అంద‌రికి షాక్ ఇచ్చారు. మ‌న పూర్వీకుల‌తో పోలిస్తే మ‌నం చేసేది అస‌లు శృంగార‌మే కాద‌న్న పూరి… కామ‌సూత్ర ద్వారా జ్ఞానం అందుకుని మ‌న పూర్వికులు శృంగారం చేసేవార‌ని పూరి చెప్పాడు. అసలు ఈ ప్ర‌పంచానికే శృంగారం అంటే ఏంటో కామ‌సూత్ర చెప్పింద‌ని చెప్పాడు.

అయితే మ‌నం ఈ విష‌యంలో చాలా యాంగిల్స్ మిస్ అయిపోయామ‌ని… వాత్సాయ‌నుడు ఏం చెప్పాడ‌న్న‌ది కూడా మ‌నం లైట్ తీస్కొంటామ‌న్నాడు. శృంగారంలో మ‌న పూర్వీకులు చేయ‌ని యాంగిల్ అంటూ లేద‌ని.. వారు చేసిందే నేడు దేవాల‌యాల్లో బొమ్మ‌ల మీద మ‌న‌కు క‌నిపిస్తోంద‌న్నారు. ఇక ఆ బొమ్మ‌ల అర్థం ఏంటంటే కామవాంఛలు తీరాకే గుడిలోకి రావాలని అప్పుడే మోక్షం లభిస్తుందని అవి చెపుతాయ‌ని పూరి చెప్పారు.

ఇక వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడే మ‌న‌కు శృంగారం మీద మోజు పోవాల‌ని.. అప్పుడే కెరీర్లో స‌క్సెస్ అవుతామ‌ని పూరి చెప్పాడు. ఇక బ్యాంకాంగ్ షూటింగ్ అంటే ముందు రెండు రోజులు రెచ్చిపోయి త‌ర్వాత సైలెంట్ అయిపోతార‌ట‌. ఇక శృంగారం గురించి మాట్లాడాలంటేనే మ‌నం భ‌య‌ప‌డుతున్నామ‌ని… కానీ మ‌న పూర్వీకులు ఇప్ప‌టికే దాని గురించి అంతా మాట్లాడేశార‌ని.. ఇక ఇక్క‌డ ఎవ్వ‌రికి స‌రిగ్గా మోక్షం ల‌భించ‌డం లేదు.. మ‌ధ్య‌లోనే పోతారు.. అందుకే ధర్మార్ధ కామ డెత్” అంటూ డాషింగ్ డైరెక్టర్ వేదం వల్లె వేశారు. మ‌రి పూరి వేదం ఎవ‌రికి ఎక్కుతుందో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news