Gossipsస‌ర్కారువారి పాట‌పై మ‌హేష్ ఫ్యాన్స్ ర‌చ్చ చేసే అప్‌డేట్ ఇది..!

స‌ర్కారువారి పాట‌పై మ‌హేష్ ఫ్యాన్స్ ర‌చ్చ చేసే అప్‌డేట్ ఇది..!

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత మ‌హేష్ న‌టిస్తోన్న ఈ సినిమాపై లెక్క‌కు మిక్కిలిగా అంచ‌నాలు ఉన్నాయి. మ‌హేష్ మూడు వ‌రుస హిట్ల‌తో ఫుల్‌స్వింగ్లో ఉన్నాడు. దీంతో స‌ర్కారు వారి పాట హిట్ అయితే మ‌హేష్ క్రేజ్ ఏ రేంజ్‌కు వెళ్లిపోతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ సినిమా షూటింగ్‌కు రెడీ అవుతోన్న వేళ మ‌హేష్ ఫ్యాన్స్ ర‌చ్చ రంబోలా చేసే అప్‌డేట్ వ‌చ్చేసింది.

Sarkaru Vaari Paata motion poster: Mahesh Babu starrer promises  'electrifying' drama | Entertainment News,The Indian Express

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాపై ఉన్న ప్లానింగ్‌ను యూనిట్ మార్చేసింద‌ట‌. మ‌హేష్ మ‌న‌కు సూప‌ర్ స్టారే అయినా త‌న స్టార్ డ‌మ్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగుకు మాత్ర‌మే ప‌రిమితం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాను పాన్ ఇండియా సినిమా రేంజ్లో తీర్చిదిద్దేలా ప్లానింగ్ మొద‌లైంద‌ట‌. తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో త‌ప్ప‌నిస‌రిగా రిలీజ్ చేస్తారు. ఇక మ‌ళ‌యాళం, క‌న్న‌డ భాష‌ల‌లో అప్పుడు ఉన్న మూమెంట్‌ను బ‌ట్టి రిలీజ్ చేసేలా ప్లానింగ్ వేస్తున్నార‌ని తెలుస్తోంది.

Kiara Advani: Sarkaru Vaari Paata: 'సర్కార్ వారి పాట'.. హీరోయిన్ మళ్లీ  ఆమేనా? ఎందుకో అర్థమౌతోందా? - kiara advani and mahesh babu to team up again  for sarkaru vaari paata | Samayam Telugu

ఒకేసారి ఐదు భాష‌ల్లో మ‌హేష్ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. ఇటు మ‌హేష్ అభిమానులు కూడా త‌మ అభిమాన హీరోను ఓ పాన్ ఇండియా రేంజ్‌లో చూడాల‌నుకుంటున్నారు. ఈ సినిమాతో వారి కోరిక తీరిపోతోంది. మ‌రి పాన్ ఇండియా రేంజ్‌లో మ‌హేష్ ఏ రేంజ్‌లో సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తాడో ? అత‌డి స్టామినా ఏంటో ఈ సినిమా చెప్పేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news