Moviesఅర్జున్‌రెడ్డి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌... కొత్త సీన్ల‌తో మ‌ళ్లీ వ‌స్తోంది..

అర్జున్‌రెడ్డి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌… కొత్త సీన్ల‌తో మ‌ళ్లీ వ‌స్తోంది..

అర్జున్‌రెడ్డి సినిమా తెలుగు సినిమా ప్ర‌పంచంలోనే కాకుండా అటు బాలీవుడ్‌లోనూ ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. విజయ్‌ దేవరకొండ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో వివాదాలు సృష్టించటంతో పాటు అంతే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఓ ప్రేమ‌క‌థ‌ను ఇంత బోల్డ్‌గా చూపించ‌వ‌చ్చా ? అని ఆ సినిమా చూశాకే సినిమా జ‌నాల‌కు తెలిసొచ్చింది. ఈ సినిమాతోనే విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్ అయిపోగా.. అటు ఈ సినిమాకు ఫిదా అయిన బాలీవుడ్ సైతం సందీప్‌రెడ్డిని అక్క‌డ‌కు తీసుకువెళ్లింది.

అక్క‌డ షాహిద్ క‌పూర్ హీరోగా క‌బీర్‌ఖాన్ టైటైల్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా అక్క‌డ క‌న‌క‌వ‌ర్షం కురిపించింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి మూడేళ్లు అవుతోంది. ఈ సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన డైరెక్ట‌ర్ సందీప్‌రెడ్డి అర్జున్‌రెడ్డి అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ సినిమాను ముందుగా 4.20 గంట‌ల నిడివితో తెర‌కెక్కించామ‌ని.. ఎడిటింగ్‌లో కొన్ని సీన్లు క‌ట్ చేయాల్సి వ‌చ్చింద‌ని.. ఫైన‌ల్‌గా 3.45 నిమిషాల నిడివితో సినిమాను రెడీ చేసుకున్నా.. అప్ప‌టికే లెన్త్ ఎక్కువైంద‌ని… చివ‌ర‌కు 3.06 గంట‌ల సినిమాను రిలీజ్ చేశామ‌ని చెప్పారు.

ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఐదేళ్లు పూర్తయ్యే సందర్భంగా 2022 ఆగస్ట్‌ 25న మ‌ళ్లీ ఈ సినిమాను విడుద చేయాలని ప్లాన్‌ చేసుకున్నామని సందీప్‌ రెడ్డి తెలిపారు. ఇక క‌ట్ అయిన సీన్ల‌లో చాలా ఫ‌న్నీ సీన్లు కూడా ఉన్నాయ‌ట. శివ, కమల్‌, విద్య, కీర్తి ఎలా క్లోజ్‌ అయ్యారు, అర్జున్‌ రెడ్డి స్కూల్‌ ప్రెండ్స్‌.. అతని బాల్యం, బుల్లెట్‌ బైక్‌ సంబంధించిన సీన్లు కొత్తగా విడుదల చేయబోయే సినిమాలో ఉంటాయట. అలాగే అర్జున్‌ రెడ్డి పెంచుకున్న కుక్కకు సంబంధించిన కామెడీ సీన్‌ కూడా ఉండబోతుదంట. మళ్లీ ఈ సినిమా ఏ రికార్డులను బ్రేక్‌ చేస్తుందో చూడాలి మరి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news