Moviesకొర‌టాల శివ - బ‌న్నీ రిలీజ్ ఎప్పుడో తెలుసా... ఫ్యీజులు ఎగిరే...

కొర‌టాల శివ – బ‌న్నీ రిలీజ్ ఎప్పుడో తెలుసా… ఫ్యీజులు ఎగిరే షాక్ ఇచ్చారే

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అల వైకుంఠ‌పుర‌ములో హిట్ త‌ర్వాత బ‌న్నీ సినిమాల ఎంపిక‌లో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంతో పాటు వ‌రుస‌గా టాప్ డైరెక్ట‌ర్ల‌తోనే సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమాలో న‌టిస్తోన్న బ‌న్నీ ఆ త‌ర్వాత కొర‌టాల శివ‌కు క‌మిట్ అయిన సంగ‌తి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెర‌కెక్కే ఈ 21వ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.

 

ఇక ఈ సినిమా న‌టీన‌టుల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్స్ ను ఈ సినిమాలో నటింపజేయాలనుకుంటున్నారట. కీల‌క‌ పాత్ర‌ధారుల‌తో పాటు విల‌న్ సైతం బాలీవుడ్ నటుడే ఉండ‌నున్నార‌ట‌. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం… ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్లో తెర‌కెక్కిస్తుండ‌డంతో పాటు ఏకంగా ఐదు భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు. ఇక హీరోయిన్ విష‌యానికి వ‌స్తే కొరటాల సినిమాలో ఖచ్చితంగా బాలీవుడ్ హీరోయిన్ ను భారీ పారితోషికం ఇచ్చి మరీ తీసుకోనున్నార‌ట‌.

 

ఇక ప్ర‌స్త‌తం కొర‌టాల మెగాస్టార్‌తో ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత సినిమాను ప్రారంభించి 2022 ఆరంభంలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దీనికి సంబంధించి పోస్ట‌ర్ మీదే ప్ర‌క‌ట‌న కూడా వేశారు. ఇక బ‌న్నీ ఫ్యాన్స్‌కు వ‌రుస‌గా రెండు బంప‌ర్ సినిమాలు ప‌డ‌నున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news