Moviesమ‌హేష్ ఫ్యాన్స్‌కు ఇంత‌క‌న్నా పెద్ద డిజ‌ప్పాయింట్ న్యూస్ ఉండ‌దుగా..!

మ‌హేష్ ఫ్యాన్స్‌కు ఇంత‌క‌న్నా పెద్ద డిజ‌ప్పాయింట్ న్యూస్ ఉండ‌దుగా..!

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు – రాజ‌మౌళి కాంబినేష‌న్లో సినిమా ఉంటుంద‌ని రాజ‌మౌళి స్వ‌యంగా చెప్ప‌డంతో అస‌లు టాలీవుడ్ అభిమానులే కాదు.. మ‌హేష్ అభిమానులు ఓ వారం రోజుల పాటు పెద్ద పండ‌గే చేసుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత తాను మ‌హేష్ సినిమాయే చేస్తాన‌ని.. దీనిని దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్‌. నారాయ‌ణ నిర్మిస్తార‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళి స్వ‌యంగా ప్ర‌క‌ట‌న చేయ‌డంతో మ‌హేష్ అభిమానులు ఒక్క‌సారిగా సంబ‌రాలు చేసుకున్నారు. అయితే ఈ సినిమా ఇప్ప‌ట్లో మాత్రం రాద‌ని తెలియ‌డంతో వాళ్లు ఒక్క‌సారిగా నిరుత్సాహానికి గుర‌య్యారు.

ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తోన్న రాజ‌మౌళి అస‌లు ఈ సినిమా ఎప్పుడు వ‌స్తుందో ?  కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఉంద‌ని స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఉన్న అంచ‌నాల ప్ర‌కారం 2021 చివ‌ర్లో కాని ఆర్ ఆర్ ఆర్ వ‌చ్చే అవ‌కాశాలు క‌న‌ప‌డ‌డం లేదు. ఇక ఏ 2022లోనే మ‌హేష్ – రాజ‌మౌళి సినిమా స్టార్ట్ అయితే యేడాది పాటు షూటింగ్ ఎలాగూ ఉంటుంది. అంటే ఈ లెక్క‌న 2023లో మాత్ర‌మే మ‌హేష్ – రాజ‌మౌళి సినిమా రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంది. అది కూడా ఇప్పటి నుంచి అనుకున్న‌వి అనుకున్న‌ట్టు జ‌రిగితేనే..?

ఇక ప్ర‌స్తుతం మ‌హేష్‌బాబు స‌ర్కారు వారి పాట సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. పెట్ల ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌. వ‌చ్చే యేడాది ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు. అప్ప‌ట‌కీ ఆర్ ఆర్ ఆర్ కంప్లీట్ అయితే మ‌హేష్ రాజ‌మౌళి షూటింగ్‌కు ఫ్రీ అవుతాడు. ఏదేమైనా మ‌హేష్ – రాజ‌మౌళి సినిమా కోసం మ‌రో మూడేళ్ల పాటు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news