Gossipsహీరోగా బ‌న్నీ... నిర్మాత‌గా స్నేహారెడ్డి... కొత్త రోల్‌లో భార్య‌భ‌ర్త‌లు..!

హీరోగా బ‌న్నీ… నిర్మాత‌గా స్నేహారెడ్డి… కొత్త రోల్‌లో భార్య‌భ‌ర్త‌లు..!

టాలీవుడ్ స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ దంప‌తులు ఇక‌పై స‌రికొత్త రోల్‌లో అవ‌త‌రించ‌నున్నారా ? అంటే అవున‌నే ఆన్స‌ర్లే వినిపిస్తున్నాయి. బ‌న్నీ కొద్ది రోజులుగా అనేక ర‌కాల బిజినెస్‌ల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వైజాగ్ రియ‌ల్ ఎస్టేట్‌లో బ‌న్నీ భారీగా పెట్టుబ‌డులు పెట్టాడ‌ని వార్తలు వ‌స్తున్నాయి. ఇక హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్‌లో బ‌న్నీ ఎప్ప‌టి నుంచో పెట్టుబ‌డులు పెట్టుకుంటూ వ‌స్తున్నాడు. ఇక ఇప్పుడు బ‌న్నీ నిర్మాత‌గా అవ‌తారం ఎత్త‌బోతున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వార్త‌లు గుప్పుమంటున్నాయి.

Sneha Reddy Height, Weight, Age, Bio, Husband, Net Worth & Wiki ...

ప్ర‌స్తుతం పుష్ప సినిమాలో న‌టిస్తోన్న బ‌న్నీ ఈ సినిమా నుంచే త‌న ప్ర‌తి సినిమాలోనూ పెట్టుబ‌డి పెట్ట‌డంతో పాటు బిజినెస్‌లో షేర్‌తో పాటు లాభాల్లో వాటా తీసుకోనున్నాడ‌ట‌. బ‌న్నీ త‌న ప్ర‌తి సినిమాలో పెట్టుబ‌డి పెట్టేందుకు ఆస‌క్తిగా ఉండ‌డంతో ఇందుకు భార్య స్నేహారెడ్డి కూడా ఓకే చెప్పింద‌ని తెలుస్తోంది.

 

మ‌హేష్ విష‌యాల్లో న‌మ్ర‌త ఎంత కేర్ తీసుకుంటుందో ఇప్పుడు బ‌న్నీ సినిమాల విష‌యంలో స్నేహారెడ్డే స్వ‌యంగా ఎంట్రీ ఇవ్వ‌డంతో పాటు పెట్టుబ‌డ వ్య‌వ‌హారాలు చూడ‌డం చేయ‌డంతో పాటు స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంద‌ని తెలుస్తోంది. మ‌రి బ‌న్నీ దంప‌తులు ఈ కొత్త రోల్లో ఎలా స‌క్సెస్ అవుతారో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news