శ్యామ్ సింగ రాయ్‌ను బయటకు వదిలిన నాని

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాలో నాని విలన్ పాత్రలో నటిస్తున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత నాని తన నెక్ట్స్ మూవీని టక్ జగదీష్ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నాడు.

ఇదిలా ఉండగానే ఇప్పుడు మరో సినిమాను లైన్ పెట్టాడు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను తాజాగా చిత్ర యూనిట్ రివీల్ చేశారు. ఈ సినిమాకు శ్యామ్ సింగ రాయ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. నాని పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేశారు. ఈ సినిమాను టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యన్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్, తదితర నటులు ఎవరనే అంశాలను చిత్ర యూనిట్ త్వరలో ప్రకటించనుంది. ఈ సినిమాను డిసెంబర్ 25న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా టక్ జగదీష్ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేసేందుకు నాని రెడీ అవుతున్నాడు.