Gossipsగ్లామర్ గేట్లు ఎత్తేసిన అమ్మడు.. ఇక ఆఫర్లు ఎందుకు రావు..!

గ్లామర్ గేట్లు ఎత్తేసిన అమ్మడు.. ఇక ఆఫర్లు ఎందుకు రావు..!

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు రాశి ఖన్నా. యువ హీరోలతో నటిస్తూ స్టార్ ఛాన్సుల కోసం ఎదురుచూస్తుంది ఈ బ్యూటీ. జై లవ కుశతో ఎన్.టి.ఆర్ లాంటి స్టార్ హీరో పక్కన నటించినా అమ్మడు ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోలేకపోయింది. వరుణ్ తేజ్ తొలిప్రేమ సూపర్ హిట్ అవగా ఆ తర్వాత మళ్లీ కెరియర్ లో వెనుకపడ్డది. బొద్దుగా ఉన్న తన రూపమే తనకు మైనస్ అనుకున్న రాశి ఖన్నా ఈమధ్య డైటింగులు గట్రా చేసి స్లిమ్ గా మారింది.

అంతేకాదు ఇంతకుముందు గ్లామర్ షోకి అడ్డు చెప్పే ఈ చిన్నది ఇప్పుడు విచ్చలవిడిగా రెచ్చిపోతుంది. గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసిన రాశి ఖన్నా వారానికో ఫోటో షూట్ తో అదరగొడుతుంది. ఇక ఇలా రెచ్చిపోతే ఆఫర్లు ఎందుకు రావు చెప్పండి. ప్రస్తుతం తెలుగులో వెంకీమామ సినిమాలో నాగా చైతన్యకు జోడీగా నటిస్తున్న రాశి ఖన్నా తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. లేటెస్ట్ గా వైట్ అండ్ వైట్ డ్రెస్ లో పిచ్చెక్కించే స్టిల్ రిలీజ్ చేసింది రాశి ఖన్న.

అమ్మడిలో ఇంత హాట్ నెస్ ఉందని ఇలా ఫోటో షూట్స్ చేసే వరకు తెలియలేదు. ఇక నుండి సినిమాల్లో కూడా ఇలా అదరగొట్టేయడం ఖాయమని చెబుతుంది. మడి కట్టుకు కూర్చుంటే ఇక్కడ పనులు అవ్వవని గుర్తించింది కాబోలు అందుకే గ్లామర్ షో విషయంలో అమ్మడు గీత దాటేసింది. మరి ఈ అమ్మడికి ఎలాంటి ఆఫర్లు వస్తాయో చూడాలి.

rashi

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news