Gossipsషాక్..హైదరాబాద్ లో హృతిక్ రోషన్ పై కేసు..!

షాక్..హైదరాబాద్ లో హృతిక్ రోషన్ పై కేసు..!

అదేంటీ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పై హైదరాబాద్ లో కేసు నమోదు కావడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారు..అవును బాలీవుడ్‌ నటుడు హృతిక్ రోషన్‌పై హైదరాబాదులోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న కల్ట్ ఫిట్‌నెస్ సెంటర్‌ నిర్వాహకులు డబ్బులు వసూలు చేస్తూ వ్యాయామానికి స్లాట్ ఇవ్వడం లేదని శశి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే… కూకట్‌పల్లి శేషాద్రి నగర్‌కు చెందిన ఐనేని శశికాంత్ అనే వ్యక్తి కె.పి.హెచ్.బి. కాలనీలోని కల్ట్.ఫిట్ జిమ్ లో గత సంవత్సరం సభ్యుత్వం తీసుకొని రూ. 17,490 నుంచి 36,400 చెల్లించారు. అయితే సభ్యత్వం తీసుకున్న సమయంలో బరువు తగ్గించటమే కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి కావల్సిన శిక్షణ తమ జిమ్‌లో లభిస్తుందని నిర్వాహకులుహమీ ఇచ్చారు.

కానీ అందులో జిమ్ సామర్థ్యానికి మించి 1800 మందిని జిమ్‌లో చేర్చుకున్నారని ఆరోపిస్తున్నారు. అంతే కాదు తనకు సరైన శిక్షణ ఇవ్వకపోగా జిమ్ చేసుకోవడానికి ప్లేస్ కూడా ఇవ్వకపోవడంతో శశికాంత్ ఇదే సమస్యను జిమ్ డైరెక్టర్లకు ఫిర్యాదు చేసాడు. కాగా, లేనిపోని హామీలతో అమాయకులను మోసం చేస్తున్నారని కల్ట్.ఫిట్ సంస్థ డైరెక్టర్లు ముఖేష్ బన్సాల్, అంకిత్ అగోరి, షణ్ముగవేల్ మణి సుబ్బయ్యలతో పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న హీరో హృతిక్ రోష‌న్‌పై శశి ఫిర్యాదు చేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news