Gossipsఅంజలి పని అంతేనా..?

అంజలి పని అంతేనా..?

వెంకటేష్, మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఏంటో నాకు అన్నీ అలా తెలిసిపోతాయ్ అంటూ అచ్చమైన తెలుగు అమ్మాయిలా అమాయకంగా మాట్లాడుతూ..తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది అంజలి. జర్ని సినిమాలో నటించిన తర్వాత ఆమెకు బాగా పేరు తీసుకు వచ్చింది..ఈ సినిమానే. హీరోయిన్ గా రెండు మూడు తెలుగు సినిమాల్లో నటించిన అంజలి తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లింది.

అంజలి లావుగా బొద్దుగా ఉండటంతో కోలీవుడ్ లో వరుసగా ఛాన్సులు రావడం మొదలు పెట్టాయి. కోలీవుడ్, మాలీవుడ్ లో అంజలి వరుస సినిమాలతో మంచి ఫామ్ లోకి వచ్చింది. అయితే తెలుగు లో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తుంది..ఆ మద్య సరైనోడు సినిమాలో ఐటమ్ సాంగ్ లో దర్శనమిచ్చింది. రెండేళ్ల క్రితం వచ్చిన ‘చిత్రాంగద’ తర్వాత తెలుగులో ఆమె ఏ సినిమాలోనూ కనిపించలేదు.

కొద్ది రోజుల క్రితం తమిళ హారర్ సినిమా ‘లిసా’.. తెలుగులోనూ అదే పేరుతో వచ్చింది కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఏదేమైనా తెలుగు దర్శక నిర్మాతలు కానీ, హీరోలు కానీ అంజలిని తెలుగులో ప్రోత్సహించకపోవడం గమనార్హం. ఆ మద్య గీతాంజలి 2 సినిమా తీస్తామని చెప్పినా అఫిషియల్ గా అనౌన్స మెంట్ రాలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news