Gossipsఅది నిజంగా ఎన్టీఆరేనా... జూనియ‌ర్‌పై కొత్త చ‌ర్చ‌..?

అది నిజంగా ఎన్టీఆరేనా… జూనియ‌ర్‌పై కొత్త చ‌ర్చ‌..?

గ‌త కొద్ది గంట‌లుగా సోష‌ల్ మీడియాలో ఓ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను చూసి సోష‌ల్ మీడియాలో ఎవ‌రికి వారు త‌మ‌కు తోచిన‌ట్టుగా వార్త‌లు రాసేసుకుంటున్నారు. మాంచి కైపుతో ఉన్న ఓ గుర్రాన్ని ఓ యువ‌కుడు మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నంలో ఉంటాడు. ఆ ప్ర‌య‌త్నం బాగా హైలెట్ అయ్యింది.

మామూలుగా అయితే ఈ వీడియోను ఎవ్వ‌రూ ప‌ట్టించుకునే వారే కాదు. అయితే అందులో ఉన్న‌ది జూనియ‌ర్ ఎన్టీఆర్ అని.. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ట్రైల్స్‌లో భాగంగా రాజ‌మౌళి ఎన్టీఆర్‌తో చేయించే ఓ సీన్ కోసం జ‌రుగుతోన్న రిహ‌ర్స‌ల్ అన్న టాక్ బ‌య‌ట‌కు రావ‌డంతో ఎన్టీఆర్‌ ఫాన్స్ దీన్ని తెగ షేర్ చేసుకున్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వీడియో విష‌యంలో అంత‌గా ర‌చ్చ చేస్తుంటే… వాస్త‌వంగా ఈ వీడియోలో ఉంది ఎన్టీఆరా ? కాదా ? అన్న‌ది క్లారిటీ లేదు. ఈ వీడియోపై రాజ‌మౌళి లేదా ఎన్టీఆర్ కాని స్పందిస్తే అస‌లు నిజం తేలుతుంది. నిజంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ వీడియో అయితే ఇంకాస్త క్లారిటీతో ఉండి ఉంటే బాగుండేది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ వీడియోను బాగా షేర్ చేస్తూ కొత్త చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌య్యారు.

ఏదేమైనా ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యే వ‌ర‌కు ఇలాంటి వీడియోలు కోకొల్ల‌లుగా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేయ‌నున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న ఆర్ఆర్ఆర్ టీమ్ త్వరలో అహ్మదాబాద్ లాంగ్ షెడ్యూల్ కోసం అవుట్ డోర్ వెళ్లనుంది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news