Moviesఫ్యాన్స్ మాటని అసలు లెక్క చేయని మహేష్..!

ఫ్యాన్స్ మాటని అసలు లెక్క చేయని మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ మహర్షి హంగామా దాదాపు ముగిసింది. కొన్ని ఏరియాలు లాస్ తెచ్చినా మహర్షి మహేష్ కెరియర్ లో హిట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఇక ఈరోజు సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా మహేష్ 26వ సినిమా ముహుర్తం పెట్టారు. సరిలేరు నీకెవ్వరు టైటిల్ తో ఈ సినిమా వస్తుంది. దిల్ రాజు, అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా మహేష్ మళ్లీ దేవి శ్రీ ప్రసాద్ నే ఎంపిక చేసుకున్నాడు.

మహర్షి విషయంలో దేవి శ్రీ ప్రసాద్ ఎన్నో అపవాదాలు మూటకట్టుకున్నాడు. కంటెంట్ వల్ల బిజిఎం వర్క్ అయ్యి ఎలాగోలా మహర్షి గట్టేక్కేసింది. అయితే మహేష్ 26 సినిమా సరిలేరు నీకెవ్వరుకి కూడా డిఎస్పిని మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈరోజు ఓపెనింగ్ లో డిఎస్పి కనిపించాడు కాబట్టి సినిమాకు ఆయనే కన్ఫాం. ఈమధ్య ఫ్యాన్స్ చాటింగ్ లో ఈసారి దేవిని తీసుకోవద్దని ఫ్యాన్స్ కోరుకున్నారు.

అయినా సరే వారి మాటని పెడ చెవిన పెట్టిన మహేష్ అనీల్ రావిపుడి సినిమాకు అతన్ని తీసుకున్నాడు. ఇక ప్రచారంలో ఉన్నట్టే రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో రాయలసీమలో ఈ కథ నడుస్తుందని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news