Gossipsషాక్ : సైరా సెట్స్ లో భారీ అగ్నిప్రమాదం..కోట్లలో నష్టం..!

షాక్ : సైరా సెట్స్ లో భారీ అగ్నిప్రమాదం..కోట్లలో నష్టం..!

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’మూవీ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. షూటింగ్ స్పాట్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ లీక్ కావడం..హైదరాబాద్ లో సెట్టింగ్ ని తొలగించడం..తాజాగా సెట్స్ లో మంటలు చెలరేగడం వంటివి సైరాను చుట్టుముడుతున్న ఇబ్బందులని చెప్పొచ్చు.

హైదరాబాద్ మణికొండలోని ఆయన ఫాంహౌస్‌లో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో అక్కడ ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం వేసిన సెట్స్ అన్ని ఈ ప్రమాదంలో అగ్ని ఆహూతయ్యాయి. ఇక సైరా సెట్‌లో అగ్ని ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. సినిమా సెట్ దాదాపు బూడిదైనట్టు తెలుస్తోంది.దీంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్టు సమాచారం. విషయం తెలిసిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ ప్రమాదంలో దాదాపు రెండు కోట్ల వరకు నష్టం జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒక ఆటంకం జరుగుతుంది. కొన్ని రోజుల క్రితం అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అగ్ని ప్రమాదంలో మనం సెట్ తో పాటు సైరా సెట్ కూడా కాలిపోయింది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news