Gossips‘ఆర్ఆర్ఆర్’ లేటేస్ట్ అప్ డేట్..!

‘ఆర్ఆర్ఆర్’ లేటేస్ట్ అప్ డేట్..!

టాలీవుడ్ లో మునుపెన్నడూ లేని విధంగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన సినిమా బాహుబలి, బాహుబలి 2. ఈ సినిమాతో రాజమౌళి తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో కూడా తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఈ సినిమా రూ.1650 కోట్లు వసూళ్లు చేసింది. ఈ సినిమా తర్వాత రాజమౌళి తీసే సినిమాలకు జాతీయ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో మరో ప్రతిష్టాత్మక సినిమా తెరకెక్కిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ అనే మల్టీ స్టారర్ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రాంచరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు. రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, మరో ముఖ్య పాత్రలో అజయ్ దేవగాన్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రముఖ దర్శకులు సముద్రఖనిని తీసుకున్న విషయం తెలిసిందే. 1920 కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. తమిళ నట దర్శకుడు సముద్రఖనిని ఏ పాత్ర కోసం తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది.

అయితే, ఈ సినిమాలో ఆయన ఎన్టీఆర్ బాబాయ్ గా కనిపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తెలంగాణ మన్నెం వీరుడు కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో సముద్రఖని పాత్ర చాలా కీలకమనీ, అందుకే ఆయనను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. మరో వారం రోజుల్లో ఈ సినిమా తాజా షెడ్యూల్ మొదలుకానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news