Gossipsవిజయ్ నోటా ఫస్ట్ డే కలక్షన్స్..! షాక్ లో సినీవర్గం..

విజయ్ నోటా ఫస్ట్ డే కలక్షన్స్..! షాక్ లో సినీవర్గం..

యువ హీరో విజయ్, ఆనంద్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా నోటా. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులు పెదవి విరిచేలా చేసింది. ఇక ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా భారీగా రిలీజైంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీమియర్స్ తో 188995 డాలర్స్ వసూళు చేసింది.
1
విజయ్ లాస్ట్ మూవీ గీతా గోవిందం ప్రీమియర్స్ తో 403442 డాలర్స్ రాబట్టగా నోటా అందులో సగానికి తక్కువ వసూళు చేసింది. అయితే తెలుగు వర్షన్ కూడా ఇదేదో తమిళ డబ్బింగ్ సినిమాలా అనిపిస్తుండటంతో నోటా కలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడింది. ఇక ఓవరాల్ గా ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో కలిపి 11 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని తెలుస్తుంది.
1
అయితే పూర్తి కలక్షన్స్ డీటైల్స్ తెలియాల్సి ఉంది. విజయ్ క్రేజ్ తో సినిమా ఆడటం తప్పితే సినిమాలో అంత దమ్ము లేదు అన్నది తేలిపోయింది. మరి విజయ్ అసలు సిసలు స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news