Gossipsసాహో గురించి సుజిత్ చెప్పిన పచ్చి నిజాలు… అసలు కథ ఇదే...

సాహో గురించి సుజిత్ చెప్పిన పచ్చి నిజాలు… అసలు కథ ఇదే !!

‘బాహుబలి ది బిగినింగ్ కు ఆరు నెలల ముందే మా ప్రాజెక్ట్ ఖాయమైంది. అప్పటికే ప్రభాస్ స్టార్ హీరో. ఇప్పుడు ప్రభాస్ ఏంటనే విషయం చెప్పక్కర్లేదు. అయినా సరే.. నేను ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ తప్ప.. సింగిల్ లైన్ కూడా ఛేంజ్ చేయలేదు. అయితే.. ఆడియన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది. అసలు ఈ సబ్జెక్ట్ ను ఎంచుకోవడంలో ఉద్దేశ్యమే.. ఇమేజ్ ను మార్చడం’ అంటున్నాడు సుజిత్. రన్ రాజా రన్ మూవీతో శర్వానంద్ కు ఇమేజ్ మేకోవర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ పార్టీలోనే సుజిత్ ను ప్రభాస్ అప్రోచ్ అయ్యి.. తనకోసం కథ రాయమన్నాడట.
2
‘ప్రభాస్ ఆ మాట చెప్పినా అవన్నీ పార్టీ కబుర్లు అని లైట్ తీసుకున్నాను. సగం వరకు మాత్రమే.. అది కూడా రాయలన్న పేరుకు రాశానంతే. మూడు నెలల తర్వాత ప్రభాస్ ఫోన్ చేసేవరకూ నిజంగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుందని అనుకోలేదు. అప్పుడు మొదటి సగాన్ని పర్ఫెక్ట్ గా ఫినిష్ చేసి.. మిగిలిన సగం ప్రభాస్ ఇంటికి వెళుతూ మైండ్ లో లాక్ చేసుకున్నాను. మొత్తం విన్నాక నా దగ్గర నుంచి స్టోరీ తీసుకుంటారని భావించాను. కానీ డార్లింగ్ మాత్రం నన్నే డైరెక్ట్ చేయమని షాక్ ఇచ్చాడు’ అన్నాడు సుజిత్. బాహుబలిని మించిపోయాడుగా… ‘సాహో’ ప్రభాస్.
111111

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news