Gossipsచరణ్ వ్యూహానికి దెబ్బ కొట్టిన సైరా..!

చరణ్ వ్యూహానికి దెబ్బ కొట్టిన సైరా..!

రాం చరణ్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా వస్తున్న ఈ సినిమా టీజర్ మంగళవారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమా టీజర్ ఓ పక్క కోటికి పైగా వ్యూస్ తో సంచలనంగా మారగా మరో పక్క ఈ సినిమా నిర్మాత చరణ్ కు పెద్ద షాక్ ఇచ్చింది. చిరు 151వ సినిమాగా వస్తున్న ఈ సైరాపై అంచనాలు పెంచేందుకు సర్వత్రా ప్రయత్నాలు చేస్తున్నాడు చరణ్.

సినిమాలో ముఖ్య పాత్రలుగా హింది నుండి అమితాబ్ తమిళ్ నుండి విజయ్ సేతుపతి కన్నడ నుండి సుదీప్ ఇలా అందర్నీ తీసుకున్నారు. సినిమా అన్ని బాషల్లో బాహుబలి రేంజ్ కు తీసుకెళ్లాలన్నది చరణ్ మెగా ప్లాన్. టీజర్ రెస్పాన్స్ కూడా అదే రేంజ్ లో ఉండటంతో సినిమా సంచలనమే అనుకున్నారు కాని బాలీవుడ్ లో సైరా ప్రస్థావనే లేదట. మిగతా బాషల్లో కూడా ఈ సినిమా అంత పెద్ద మార్కెట్ చేయట్లేదని టాక్. సైరాపై చరణ్ పెట్టుకున్న ఆశలు అడీఅశలు అయ్యేలా కనిపిస్తున్నాయి. మరి చరణ్ వ్యూహం మారుస్తాడా లేక ప్రమోషన్స్ ఇంకాస్త పెంచుతాడా అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news