Moviesఆఫీసర్ రియల్ పబ్లిక్ టాక్..కొందరు అలా.. మరికొందరు ఇలా..!

ఆఫీసర్ రియల్ పబ్లిక్ టాక్..కొందరు అలా.. మరికొందరు ఇలా..!

నాగార్జున, ఆర్జివి కాంబినేషన్ లో వచ్చిన ఆఫీసర్ సినిమా రియల్ పబ్లిక్ టాక్ ఎలా ఉంది అంటే సినిమాను కొందరు పర్వాలేదు ఆర్జివి మార్క్ మూవీగా ఉందా అంటుంటే. మరికొందరు మాత్రం సినిమా చెత్త అనేస్తున్నారి. అయితే సినిమా టాక్ ఎలా ఉన్నా అందరు చెప్పే విషయం మాత్రం ఒకటే అదే నాగార్జున పర్ఫార్మెన్స్.

తనకు ఎలాంటి చాలెంజింగ్ పాత్ర ఇచ్చినా దానికి నూటికి నూరుపాళ్లు న్యాయం చేసే నాగార్జున ఈ సినిమాలో కూడా శివాజిరావు పాత్రలో అదరగొట్టాడు. ఇక వర్మ ముందు చెప్పినట్టుగా ఈ సినిమా అయితే అంచనాలను అందుకోలేదు. మాఫియా.. గన్ సౌండ్స్.. ఏమాత్రం కొత్తగా అనిపించని కథ కథనాలతో సినిమా నిరాశపరుస్తుంది.

సినిమా టేకింగ్.. మ్యూజిక్ ఇంకా హీరోయిన్ మైరా సరైన్.. చిన్న పాప కాస్త పర్వాలేదు అన్నట్టు చేశారు. విలనిజం భారీగా చూపించి అతన్ని చివరకు సిల్లీగా చంపడం కూడా బాగా అనిపించదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news