Gossipsఅభిమానమంటే ఇదే.. రెండు నెలలు ముందుగానే ఎన్టీఆర్ బీభత్సం..!

అభిమానమంటే ఇదే.. రెండు నెలలు ముందుగానే ఎన్టీఆర్ బీభత్సం..!

టాలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరైన ఎన్.టి.ఆర్ తనకు మాత్రమే సాధ్యపడే కొన్ని సినిమాలను చేస్తూ వస్తున్నాడు. కొన్నాళ్లు కెరియర్ లో కాస్త వెనక్కి పడినట్టు కనిపించినా మళ్లీ ట్రాక్ ఎక్కేశాడు. ప్రస్తుతం త్రివిక్రం సినిమా కోసం సిద్ధమవుతున్న ఎన్.టి.ఆర్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్నాడు. ఫ్యాన్స్ అందరికి అభిమాన నటుడు సినిమాలే కాదు అతని బర్త్ డే కూడా పండుగ లాంటిదే. ఎన్.టి.ఆర్ లాంటి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలకైతే తమ పుట్టినరోజు ఫ్యాన్స్ స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.

మే 20న తారక్ బర్త్ డే.. అయితే పుట్టినరోజుకి ఇంకా రెండు నెలలు ముందు నుండే ఎన్.టి.ఆర్ కు ఫ్యాన్స్ తరపునుండి బర్త్ డే విశెష్ అందుకుంటున్నాడు. తనకు ఉన్న ఫేస్ బుక్, ట్విట్టర్ ఫాలోవర్స్ అండ్ ఫ్యాన్స్ నుండి రోజు దాదాపు వేలకొద్ది అడ్వాన్స్ బర్త్ డే విశెష్ అందుకుంటున్నాడట ఎన్.టి.ఆర్. అభిమానులు తనపై చూపించే ప్రేమకు తను కూడా సాధ్యమైనంతవరకు వారికి నచ్చే సినిమాలను తీస్తున్నాడు.

ఇక రాబోతున్న పుట్టినరోజు కానుకగా త్రివిక్రం సినిమాకు సంబందిచి ఫస్ట్ లుక్ టీజర్ రివీల్ చేసే అవకాశం ఉంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news