Newsదసరాకే ఎన్టీఆర్.. బాలయ్య స్పీడ్ పెంచేశాడు..!

దసరాకే ఎన్టీఆర్.. బాలయ్య స్పీడ్ పెంచేశాడు..!

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత కథతో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ గా వస్తున్న సినిమా ఎన్.టి.ఆర్. ఈరోజు సెట్స్ మీదకు వెళ్తున్న ఈ సినిమా రామకృష్ణ సిని స్టూడియోస్ లో మొదలైంది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా వచ్చిన ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ పాల్గొన్నారు.

ఇక ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ గా బాలయ్య కనిపించనున్నారు. దాదాపు సినిమా కోసం 60 గెటప్పుల్లో కనిపిస్తారట. తేజ డైరక్షన్ లో తెరకెక్కే ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే సినిమాకు సంబందించిన మొత్తం పనులు ఏర్పరచిచారట.

షూటింగ్ కు వెళ్లడమే ఆలస్యం త్వరగా ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చూస్తున్నారు. ఎన్.టి.ఆర్ జీవితానికి సంబందించి ఎవరికి తెలియని విషయాలను ఈ బయోపిక్ లో ప్రస్థావించడం జరుగుతుందని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news