Moviesనీదీ నాదీ ఒకే కథ.. ఈ లెక్క తెలిస్తే షాక్..!

నీదీ నాదీ ఒకే కథ.. ఈ లెక్క తెలిస్తే షాక్..!

శ్రీ విష్ణు హీరోగా వేణు ఊడుగుల డైరక్షన్ లో వచ్చిన సినిమా నీదీ నాదీ ఒకే కథ. లాస్ట్ ఫ్రై డే రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ముఖ్యంగా యువతను ఆకట్టుకుంటున్న ఈ సినిమా మొత్తం బడ్జెట్ విన్ పబ్లిసిటీతో కలుపుకుని కూడా రెండున్నర కోట్లు మించలేదు. అయితే ఈ సినిమా ఇప్పటికే ఆ మొత్తాన్ని రాబట్టింది.

అంతేకాదు రిలీజ్ అయిన మూడు రోజుల్లో అదనంగా మరో 70 థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది నీదీ నాదీ ఒకే కథ. కచ్చితంగా ఈ ఇయర్ సూపర్ హిట్ సినిమాల్లో ఈ సినిమా ఒకటని చెప్పొచ్చు. స్టార్ సినిమా కోట్ల కొద్ది బడ్జెట్ సినిమా నిలబడుతుందా లేదా అన్న నమ్మకం లేదు. కాని ఈమధ్య తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు మాత్రం స్టార్స్ కు చుక్కలు చూపిస్తున్నాయి.

కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ గా యువ దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. నీదీ నాదీ ఒకే కథ లెక్కలు చూసి అందరు షాక్ అవుతున్నారు. ఇక ఈ వారం రంగస్థలం వస్తుంది కాబట్టి ఈ సినిమా జోరుకి బ్రేకులు పడే అవకాశం ఉంది. ఒకవేళ అది కనుక అటు ఇటైతే శ్రీవిష్ణు సినిమా ఆపేవారే ఉండరు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news