Gossipsబాలయ్యను వాడుకోవడమేంటి.. ఆయన్ను చూసి నేర్చుకున్నా..!

బాలయ్యను వాడుకోవడమేంటి.. ఆయన్ను చూసి నేర్చుకున్నా..!

మెగా హీరో సాయి ధరం తేజ్ హీరోగా వి.వి.వినాయక్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఇంటిలిజెంట్. ఈ సినిమా ట్రైలర్ బాలయ్య చేతుల మీదుగా రిలీజ్ చేశారు. నందమూరి నట సింహం బాలయ్య బాబుది లక్కీ హ్యాండ్ అంటారు అందుకే ఆయన చేత సినిమా ప్రమోట్ చేయించామని సినిమా ప్రమోషన్స్ లో అన్నాడు సాయి ధరం తేజ్.

అంతేకాదు అప్పటితరం స్టార్ హీరోలు కాబట్టే బాలయ్య ఎలాంటి ఈగో లేకుండా ముందు మెగా ఫ్యాన్స్ అంటూ సంభోదించారని.. ఇక సి.కళ్యాణ్ గారి బ్యానర్ ను తన ఓన్ బ్యానర్ గా కూడా చెప్పుకొచ్చారని అన్నారు. వారి చూసి చాలా నేర్చుకోవాలని.. ఇక ఈ సినిమాకు తాను బాలయ్యను వాడుకున్నానని వస్తున్న కామెంట్లను కొట్టి పారేశాడు తేజ్.

తను బాలయ్యను వాడుకోవడం ఏంటని అన్నాడు. సినిమా ఇండస్ట్రీ అంతా కలిసి ఉంటేనే బాగుంటుందని.. ఎవరు ఎవరిని వాడుకునే అవకాశం లేదని ఇంటిలిజెంట్ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు సాయి ధరం తేజ్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news