Gossipsకులం పేరెత్తితే చెప్పుతో కొట్టమంటున్న రకూల్ !

కులం పేరెత్తితే చెప్పుతో కొట్టమంటున్న రకూల్ !

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే తడుముకోకుండా టక్కున గుర్తుకు వచ్చేపేరు రకుల్ ప్రీత్ సింగ్. ‘వెంకట్రాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ వరుసపెట్టి అందరి హీరోల పక్కన నటిస్తూ తన హవా చూపిస్తోంది.

తాజాగా ఈ అందాల సుందరికి ఉన్నట్టు ఉండి ఏమైందో కానీ ఒక్కసారిగా కులం గురించి ప్రస్తావన తీసుకొచ్చి విరుచుకుపడుతోంది. అంతే కాదండోయ్ కులం పేరు ఎవరైనా చెబితే వారిని చెప్పు తీసుకుని కొట్టండి అంటూ పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతోంది.

మనం బతికేది కులాల మీద కాదు. ఆ విషయం అందరూ తెలుసుకోవాలి. కులం అన్నం పెట్టదు, కులం సమాజంలో గౌరవం ఇవ్వదు. అంటూ తెగ క్లాస్ పీకుతోంది. ఇంతటితో ఆగితే ఫర్వాలేదు , కులం గోడల్ని కూల్చేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి. ముఖ్యంగా యువతరం నడుం బిగించాల్సిన అవసరం ఉందంటూ పిలుపునిచ్చింది రకుల్.

తెలుగు సినీపరిశ్రమలో అగ్ర హీరోయిన్‌లలో ఒకరుగా వున్న రకుల్‌లో ఉన్నట్లుండి ఈ స్థాయిలో కులాల మీద విరుచుకుపడడం వెనుక ఆంతర్యం ఏంటో అర్ధం కావడం లేదు. కొంపదీసి ఈ ముద్దుగుమ్మని ఎవరన్నా ఈ ప్రశ్న వేసారో ఏంటో తెలియడంలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news