Gossipsబడికి వెళ్తా .. సినిమాలొద్దు అంటున్న ఎన్టీఆర్ హీరోయిన్

బడికి వెళ్తా .. సినిమాలొద్దు అంటున్న ఎన్టీఆర్ హీరోయిన్

సినిమా ఇండ్రస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఉండి కెరియర్ మంచి ఊపుమీద ఉన్న సమయంలో ఏ హీరోయిన్ అయినా ఏం చేస్తారు..? ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని మరింత క్రేజ్ సంపాదించుకోవాలని చూస్తారు. అయితే అందాల మలయాళీ భామ నివేద థామస్ మాత్రం దానికి భిన్నంగా నిర్ణయం తీసుకుని అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

టాలీవుడ్‌లో హ్యాట్రిక్ విజయాలతో ఊపుమీదున్న అందాల బొమ్మ నివేదా థామస్ కొద్ది రోజులు సినిమాలకు విరామం ఇవ్వనుంది. దీంతో, తనకు ఆఫర్లు వస్తున్నా… ఆమె మాత్రం వాటికీ నో చెప్పేస్తోంది.‘జెంటిల్ మ్యాన్’ సినిమాతో పరిచయమైన నివేదా థామస్.. ఈ సంవత్సరం నటించిన ‘నిన్ను కోరి’, ‘జై లవ కుశ’ సినిమాలతో విజయాలు అందుకుంది.

అయితే, ఈ సినిమా పరాజయం ఆమె ఆఫర్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. తనకు ఆర్కిటెక్చర్ పరీక్షలు ఉండడంతో కొంతకాలం సినిమాలకు దూరం అవ్వాలని ఈ భామ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బాలనటిగా సినీరంగంలోకి ప్రవేశించిన 22 ఏళ్ల నివేదా మంచి నటి మాత్రమే కాదు చదువులో కూడా మంచి మెరిట్ స్టూడెంటే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news