Newsహైపర్ ఆదికి మద్దతుగా అనుసూయ ఎందుకో తెలుసా..? 

హైపర్ ఆదికి మద్దతుగా అనుసూయ ఎందుకో తెలుసా..? 

కొద్దిరోజులుగా జబర్దస్త్ కామెడీ షో కు సంబంధించి తరుచు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వివాదంలో  హైపర్ ఆదికి మద్దతుగా జబర్దస్త్ భామ అనసూయ రంగంలోకి దిగింది. దీనిపై సోషల్ మీడియా లో అభిమానుల మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఈ భామ.
అసలు ఈ వివాదం ఎందుకొచ్చిందంటే…హైపర్ ఆది అనాథల్ని ఉద్దేసిస్తూ నన్ను చిన్నప్పుడు చెత్త కుండీలో పడేశారని అనాథ పాత్రధారిగా ఉన్న రైజింగ్ రాజు అంటే.. నీ లాంటి వాడిని చెత్త కుండీలో కాకుండా తిరుపతి హుండీలో వేస్తారా.. వీళ్లు అనాథల్లా లేరు.. పదికీ పాతికకు పీకలు కోసేలా ఉన్నారు వీళ్లు అనాథలు ఏంటి?
ఇంతకీ అనాథలు అంటే ఏమిటో తెలుసా.. అతిగా ఆవేశపడే ఆడదానికి.. అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానాన్నే అనాథలు అంటారని తనదైన శైలిలో మాట్లాడ్డం అతని పీకకు చుట్టుకుంది.
నాథలు అంటే సంఘంలో ఓ గౌరవం ఉందని మమ్మల్ని కించపరచడమే కాకుండా మా గౌరవానికి భంగం కలిగేలా చేసిన జబర్దస్త్ కామెడీ షో పైన హైపర్ ఆదిపైన చర్యలు కోరుతూ  అనాథ యువతులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు.
దీంతో హైపర్ ఆదికి మద్దతుగా అనుసూయ కామెంట్స్ చేసింది. కామెడీని కామెడీగా చూడాలని కోరింది. అయితే ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో అనుసూయ ట్వీట్ గురించి పలువురు నెగిటీవ్ కామెంట్లు కూడా  చేశారు. ఆ కామెంట్లపై స్పందించిన అనసూయ తనతో వాదించేవారిని బ్లాక్ చేస్తున్నానంటూ ట్వీట్ చేసింది.
అభ్యంతరంగా ఉన్న వాటిని  మీరు ఎంకరేజ్ చేస్తారా అన్న ప్రశ్నలకు సమాజంలో ఇన్ని జరుగుతుంటే వాటిని పట్టించుకోకుండా ఆ షో గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటూ ఈ భామ మండిపడింది. అంతే కాకుండా అసభ్యంగా వాదనకు దిగుతున్న వారిని బ్లాక్  చేస్తున్నా అంటూ ముగించింది ఈ సెక్సీ యాంకర్.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news