Gossipsవాళ్లంటే ఆ జబర్దస్త్ భామకి అంత ఇష్టమా ..?

వాళ్లంటే ఆ జబర్దస్త్ భామకి అంత ఇష్టమా ..?

హాట్ యాంకర్‌గా బుల్లి తెరతో పాటు వెండి తెరను కూడా ఓ ఊపు ఊపుతున్న అనసూయ‌ క్రేజ్ అంతా ఇంతా కాదు.

ప్రస్తుతం ఈ అందాల యాంకర్ టీవీ షోలో ఒక గంట నటిస్తే లక్ష రూపాయల వరకు డిమాండ్ చేస్తోందంటే ఈమె క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. జబర్దస్త్ షో తో ఈమె బాగా పాపులర్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆ షో గురించి ఏమి చేప్తోందో తెలుసా ..?

అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో అభిమానులతో చాట్ చేస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది కూడా. అనసూయ తరచుగా తన అభిమానులతో సోషల్ మీడియాలో టచ్ లో ఉంటుంది. తాజాగా, ట్విట్టర్ లో అభిమానులతో అనసూయ చాట్ చేసింది. ఆ సందర్భంగా ఈ మోడరన్ యాంకర్ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

DPTF21qXUAAikP2

జబర్దస్త్ షో గురించి ఒక్కమాటలో చెప్పాలని ఓ అభిమాని అనసూయను అడిగింది. జబర్దస్త్ షో నాకు మరో కుటుంబం వంటిదని అనసూయ జవాబిచ్చింది. తనకు సుమ , రష్మి గౌతమ్, ప్రదీప్ ల యాంకరింగ్ అంటే చాలా ఇష్టమని మరో అభిమాని ప్రశ్నకు సమాధానమిచ్చింది.

తన ఇద్దరు పిల్లలు సూపర్ డూపర్ అని మరో ప్రశ్నకు బదులిచ్చింది. తాను ప్రస్తుతం రంగస్థలంతో పాటు, సచ్చిందిరా గొర్రె, మరో ప్రాజెక్ట్ లో పని చేస్తున్నానని తెలిపిందీ జబర్దస్త్ భామ. అనసూయ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రంగస్థలంలో నటిస్తోంది. బుల్లితెర తో పాటు వెండి తెరను కూడా ఏలాలని ఈ జబర్దస్త్ భామ కలలు కంటోంది.

DPTF214XUAACIId DPIritDVAAIVpqA DPTF21-WsAA1jE0 DPTF21wXUAA_tYW

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news