Gossipsఆ యంగ్ హీరోతో ఫిక్సయిన నివేద

ఆ యంగ్ హీరోతో ఫిక్సయిన నివేద

జెంటిల్మన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన మలయాళ భామ నివేదా థామస్. ఆ సినిమా తర్వాత మరోసారి నానితో నిన్ను కోరి సినిమాలో నటించింది అమ్మడు. ఇక ఈమధ్యనే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ జై లవ కుశ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన నివేదా థామస్ ఇప్పుడు ఓ లక్కీ ఛాన్స్ అందుకుందట.

నాచురల్ స్టార్ నాని తర్వాత తెలుగులో అదే రేంజ్ నాచురల్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టే శర్వానంద్ సినిమాలో నివేదా ఛాన్స్ కొట్టేసిందట. రీసెంట్ గా వచ్చిన మహానుభావుడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శర్వానంద్ తన తర్వాత సినిమాను సుధీర్ వర్మతో చేస్తున్నాడు. సినిమాలో శర్వాకు జోడీగా నివేదా థామస్ ఓకే అయ్యిందట.

కచ్చితంగా నివేదాకు ఇది లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇదే కాకుండా అమ్మడు మరో రెండు మూడు క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకుందట. చూస్తుంటే నివేదా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news