Gossipsబాబీ డైరెక్షన్ లో ఆ మెగా హీరో ...

బాబీ డైరెక్షన్ లో ఆ మెగా హీరో …

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో జై లవ కుశ సినిమా తీసిన దర్శకుడు బాబి ఎట్టకేలకు సినిమాతో తన ఖాతాలో హిట్ వేసుకున్నాడు. పవర్ తో హిట్ అందుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత వచ్చిన పవర్ స్టార్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో అపవాదాపు మూటకట్టుకున్నాడు. ఇక జై లవ కుశతో తన సత్తా చాటాలనుకున్న బాబి అనుకున్న విధంగా సక్సెస్ కొట్టి సూపర్ అనిపించుకున్నాడు.

అందుకే బాబికి ఇప్పుడు అవకాశాల వెళ్లువ మొదలైందట. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాబికి ఫోన్ చేసి సినిమా సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్ తో పాటుగా మంచి కథ ఉంటే తీసుకురా అని చెప్పాడట. బన్నితో బాబి సినిమా అంటే అది కూడా అదిరిపోయే కాంబినేషన్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం బన్ని వక్కంతం వంశీ డైరక్షన్ లో నా పేరు సూర్య సినిమా చేస్తుండగా ఆ తర్వాత సినిమా అసలైతే లింగుసామితో తెలుగు తమిళ బైలింగ్వల్ ఉండాలి.. అది కుదరకపోతే మాత్రం బాబితో ఫిక్స్ అయ్యే ఆలోచనలో ఉన్నాడట బన్ని.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news