Gossipsమహేష్ స్పైడర్ పై అభిమానులు గరం గరం .,.,

మహేష్ స్పైడర్ పై అభిమానులు గరం గరం .,.,

స్పైడర్ సినిమా ప్రకటించిన వెంటనే మహేష్ బాబు ఫాన్స్ లో సూపర్ డూపర్ పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చేసింది. మహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్ అంటే అంతకంటే ఫాన్స్ కి ఏం కావాలి. అసలే కత్తి లాంటి ఇండస్ట్రీ హిట్ తీసి జోష్ మీద ఉన్నాడు కూడా సో మహేష్ తో మురుగదాస్ ఒక సంచలనం తీస్తాడు నే ఆలోచనలో ఉన్నారు.

ఫాన్స్ ఎప్పుడో విడుదల అవ్వాల్సిన స్పైడర్ చిత్రం దసరా వరకూ సాగుతూ వచ్చింది.స్పైడర్ సినిమాకి సంబంధించి ఎన్నో నెలల పాటు ఫస్ట్ లుక్ కోసం టైటిల్ కోసమే ఎదురు చూసేలా చేసారు .

ఇలాంటి విషయాల్లో చిరాకుగా ఉన్న ఫాన్స్ ని టీజర్ ఇంకా కలవార పెట్టింది. హైప్ ని రీచ్ అయ్యే రేంజ్ లో అసలు ఆ టీజర్ ఎక్కడా కనపడలేదు. అయితే ఇప్పటి వరకూ విడుదల అయిన రెండు పాటలదీ అదే పరిస్థితి.

తమిళ పాటని తెలుగులో డబ్బింగ్ చేసిన సౌండింగ్‌. మహేష్ అభిమానులకు మింగుడు పడడం లేదు. ఇవి చాలవన్నట్టు. ఇప్పుడు స్పైడర్ ఆడియో ఫంక్షన్‌ని తమిళనాడుకి షిప్ట్ చేశారు. అక్కడ తమిళ పాటల్ని విడుదల చేసి, తెలుగులో మరో ఫంక్షన్ ఏర్పాటు చేస్తారనుకొంటే, తెలుగు, తమిళ పాటల్ని కంబైన్డ్‌గా అక్కడే రిలీజ్ చేసేస్తున్నారిప్పుడు.  ఫాన్స్ ని  ఈవిషయం ఇంకా కలవార పెట్టింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news