Moviesడిఎస్పిని హీరో చేస్తా... ఆ తర్వాత రికార్డుల లెక్క తేలుస్తా..!

డిఎస్పిని హీరో చేస్తా… ఆ తర్వాత రికార్డుల లెక్క తేలుస్తా..!

మ్యూజిక్ మిరాకిల్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ హీరో సినిమా అయినా సరే తన మ్యూజిక్ తోనే సగం హిట్ చేసే దేవి ఇక సినిమా ఆడియో రిలీజ్ లో చేసే హంగామా గురించి అందరికి తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ లోని ఈ ఎనర్జీని చూసి అతను హీరోగా చేస్తే బాగుండని అనుకున్నాడు సుకుమార్. అనుకోవడమే కాదు ఆ మేరకు ప్రయత్నాలు కూడా సాగాయి.

దేవి స్నేహితుడు క్రియేటివ్ డైరక్టర్ అయిన సుకుమార్ దేవిని హీరోగా పెట్టి సినిమా తీయాలని కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే సుకుమార్ ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు చేస్తూ ఉండటం వల్ల దేవితో మూవీ చేయడం కుదరట్లేదు. ఈసారి మాత్రం దేవి శ్రీ ప్రసాద్ తో సినిమా తీసి తీరుతా అంటున్నాడు సుకుమార్.

రంగస్థలం బదులు దేవి హీరోగా సినిమా చేయాల్సి ఉన్నా అది కుదరలేదని కాని ఈసారి మాత్రం డిఎస్పిని హీరోగా చేసి చూపిస్తా అంటున్నాడు సుకుమార్. ఫ్రెండ్షిప్ డే రోజు ఈ విషయాన్ని వెల్లడించారు సుకుమార్. మరి సుకుమార్ లాంటి దర్శకుడి సినిమాతో దేవి శ్రీ ఎలా ఏ అవతారంలో ప్రేక్షకుల ముందుకు వస్తాడో ఎన్ని రికార్డుల లెక్క తేలుస్తాడో అని రాక్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news