Moviesపవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే రోజు వచ్చింది..!

పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే రోజు వచ్చింది..!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ పండుగ చేసుకునే గిఫ్ట్ ఇచ్చే రోజు వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ డైరక్షన్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్న మూడో సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఆగష్టు 15న ఇండిపెండన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత త్రివిక్రం పవన్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో రికార్డ్ రేటు పలుకుంతుంది.

కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో కె.రాధాకృష్ణ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమా టైటిల్ కూడా ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. కాటమరాయుడు అంచనాలను అందుకోని పవన్ ఈసారి టార్గెట్ మిస్ అవ్వదని అంటున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news