Moviesకొరటాలకి చుక్కలు చూపిస్తున్న ప్రకాష్ రాజ్..!

కొరటాలకి చుక్కలు చూపిస్తున్న ప్రకాష్ రాజ్..!

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా కొరటాలకు మంచి క్రేజ్ ఉంది. రచయిత నుండి దర్శకుడిగా మారి సోషల్ మెసేజ్ ఉన్న కథతో కమర్షియల్ హిట్లు కొడుతున్నాడు కొరటాల శివ. జనతా గ్యారేజ్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో మహేష్ తో భరత్ అను నేను సినిమా స్టార్ట్ చేశాడు శివ. ఆ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉండగా సినిమాలో ప్రకాష్ రాజ్ కు తగ్గ పాత్ర రాశాడట.

విలక్షణ నటుడిగా మంచి పేరున్న ప్రకాష్ రాజ్ కొరటాల శివకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాడట. అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ కంప్లీట్ చేయాలని నిర్ణయించగా ఇచ్చిన డేట్స్ కు ప్రకాష్ రాజ్ రావట్లేదని టాక్. ఒక్కోసారి యూనిట్ అంతా సిద్ధంగా ఉన్నా ప్రకాష్ రాజ్ వల్ల ప్యాకప్ చెప్పిన సందర్భాలు ఉన్నాయట. ఇక ఇలా అయితే సినిమా పూర్తి చేయడం కష్టమని ప్రకాష్ రాజ్ బదులు వేరే అతన్ని తీసుకోవాలని చూస్తున్నాడట కొరటాల శివ.

మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో స్పైడర్ రిలీజ్ కు సిద్ధమవుతుండగా భరత్ అను నేను మాత్రం సంక్రాంతి బరిలో దిగుతుందని అంటున్నారు. మరి సినిమాలో ప్రకాష్ రాజ్ ఉంటాడా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news