Moviesజై లవ కుశ.. కుశ లుక్.. అంచనాలకు మించి..!

జై లవ కుశ.. కుశ లుక్.. అంచనాలకు మించి..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవ కుశ సినిమా నుండి కుశ లుక్ ఈరోజు రిలీజ్ అయ్యింది. వినాయక చవితి సందర్భంగా ఫ్యాన్స్ కు కుశల్ కుమార్ లుక్ రివీల్ చేశాడు ఎన్.టి.ఆర్. నిన్న లవ కుమార్ టీజర్ తో సర్ ప్రైజ్ చేసిన తారక్ ఈరోజు కుశ పోస్టర్ తో మరింత అంచనాలను పెంచేశారు.

ఇక కుశ లుక్ చూస్తుంటే ఎన్.టి.ఆర్ స్టైలిష్ లుక్ తో పాటుగా ఈ క్యారక్టర్ కొత్తగా ఉండబోతుందని మాత్రం అనిపిస్తుంది. మూడు పాత్రలు మూడు రకాల వేషధారణలు చెప్పాలంటే ఎన్.టి.ఆర్ నట విశ్వరూపం చూపినేందుకు జై లవ కుశ చరిత్రలో నిలిచిపోయే సినిమా అని తెలుస్తుంది. సినిమాలో ప్రతి విషయాన్ని ప్రత్యేకమైన జాగ్రత్తతో తెరకెక్కిస్తున్న జై లవ కుశ దసరా బరిలో రాబోతుంది.

సెప్టెంబర్ 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news