Moviesరంగులరాట్నంలో ఇరుకున్న రాజ్ తరుణ్...షాక్...!

రంగులరాట్నంలో ఇరుకున్న రాజ్ తరుణ్…షాక్…!

ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ కెరియర్ లో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా కెరియర్ కొనసాగిస్తున్నాడు. ఈ ఇయర్ ఇప్పటికే కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు సినిమాలతో వచ్చిన రాజ్ తరుణ్ ప్రస్తుతం ఓ లేడీ డైరక్టర్ సినిమా చేస్తున్నాడట. ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున నిర్మిస్తుండటం విశేషం.

ఈ సినిమాకు రంగుల రాట్నం అని టైటిల్ పెట్టబోతున్నారట. సినిమా రాజ్ తరుణ్ కెరియర్ లో కొత్త ఉత్సాహం ఇస్తుందని అంటున్నారు. ఇన్నాళ్లు కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు తీస్తూ వచ్చిన రాజ్ తరుణ్ మొదటిసారి కొత్త ప్రయోగం చేస్తున్నాడట. షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని అంటున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.

నాగార్జున నటిస్తున్న రాజు గారి గది-2, అఖిల్ సినిమాల గ్యాప్ లో ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అక్టోబర్ లో రిలీజ్ ఉంటుందని చెబుతున్నారు. మరి రాజ్ తరుణ్ రంగులరాట్నం ఎలాంటి సందడి చేస్తుందో చూడాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news