Moviesవామ్మో అనుష్క పవర్ చెక్ పెట్టేసింది...

వామ్మో అనుష్క పవర్ చెక్ పెట్టేసింది…

స్వీటీ అనుష్క ఏంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను దాటేయడమేంటని ఆశ్చర్యపోవచ్చు. తెలుగులో పవర్ స్టార్ రేంజ్ ఏంటో తెలిసిందే అయితే హిందిలోకి వచ్చేసరికి పవన్ సినిమా అంటే మోస్తారు సినిమాగా లెక్క కట్టారు. ఇక అరుంధతి నుండి బాహుబలి వరకు ప్రయోగాలతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఓ అందం తెచ్చిన అనుష్క సినిమా మాత్రం బాలీవుడ్ లో బిజినెస్ అదరగొడుతుంది.

పవన్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న మూవీ హింది రైట్స్ 11 కోట్లకు అమ్ముడవగా అనుష్క నటిస్తున్న భాగమతి రైట్స్ పవన్ ను దాటేసి అత్యధికంగా 12.5 కోట్లకు బిజినెస్ చేసింది. బాహుబలితో హిందిలో కూడా క్రేజ్ తెచ్చుకున్న అనుష్క ఆ క్రేజ్ తోనే భాగమతి బిజినెస్ ను సంపాదించుకుంది. యువి క్రియేషన్స్ పతాకంలో వస్తున్న భాగమతి సినిమా పిల్ల జమిందార్ డైరక్టర్ అశోక్ డైరెక్ట్ చేస్తున్నారు.

మరి హిందిలో పవన్ ను దాటేసిన అనుష్క అక్కడ ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో చూడాలి. అసలైతే దసరా బరిలో భాగమతి ఉంటుందని అనుకున్నా గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ వల్ల సినిమా పోస్ట్ పోన్ అయ్యిందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news