Moviesకోటి ఆఫర్ ను కాలదన్నుకున్న భామ..!

కోటి ఆఫర్ ను కాలదన్నుకున్న భామ..!

మలయాళ ప్రేమంతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి తెలుగులో ఫిదాతో ఆడియెన్స్ తో పాటు సిని ప్రముఖులను ఫిదా చేసింది. భానుమతిగా సాయి పల్లవి సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో ఒకటని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా తర్వాత సాయి పల్లవికి కోటి ఇస్తామంటూ ఆఫర్లు వస్తున్నాయట.

ప్రేమం తర్వాత కూడా తనకు మలయాళంలో బాగా ఆఫర్లు వచ్చాయని కాని తను మాత్రం అక్కడ ఒక్క సినిమానే చేశానని అంటుంది సాయి పల్లవి. తెలుగులో కూడా ఫిదా తర్వాత కోట్ల ఆఫర్లు వస్తున్నా ప్రస్తుతం నానితో ఎం.సి.ఏ సినిమా మాత్రమే చేస్తున్నా అని డబ్బులు సంపాదించడానికి తాను నటిని కాలేదని.. ఉన్నతమైన పాత్రలు పోశించి, ప్రేక్షకులకు కలకాలం గుర్తుండిపోయేలా ఉండాలని అంటుంది.

ఇప్పటికే ఫిదాతో ఈ కాలం సావిత్రి అంటూ ప్రశంసలు అందుకున్న సాయి పల్లవి తనకు ఎంత స్టార్డం వచ్చినా డబ్బు కోసం మాత్రం తనకు నచ్చని పాత్ర చేయనని బల్ల గుద్ది మరి చెబుతుంది. సినిమా సినిమాకు రెమ్యునరేషన్ పెంచే భామలున్న ఈ రోజుల్లో సాయి పల్లవిలా ఆలోచించే హీరోయిన్స్ చాలా కష్టమే అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news