Moviesచెప్పే దమ్ముంది రాసే దమ్ముందా.. డ్రగ్స్ పై పూరి సంచలన వ్యాఖ్యలు..!

చెప్పే దమ్ముంది రాసే దమ్ముందా.. డ్రగ్స్ పై పూరి సంచలన వ్యాఖ్యలు..!

రెండు రోజులుగా టాలీవుడ్ లో డ్రగ్ కేసుకి సంబందించిన హడావిడి తెలిసిందే. ముందు సిని పెద్దలు వార్నింగ్ ఇవ్వడం పోలీసులు రంగంలో దిగి కొందరు పేర్లు వెళ్లడించడం అంతా జరిగింది. అయితే ఈ సీన్ లో టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ పూరిని బుక్ చేశారు. లిస్ట్ లో పూరి పేరు ఉందో లేదో తెలియదు కాని పూరి తనతో ఉన్న గ్యాంగ్ మొత్తం డ్రగ్ ఎడిక్ట్స్ అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఈ విషయంపై పూరి ఇంతవరకు నోరు విప్పలేదు. అయితే కొంతమనది సీనియర్ పాత్రికేయుల ద్వారా ఫోన్ లో పూరి ఈ విషయంపై ధ్వజమెత్తాడట. తాను డ్రగ్స్ వాడుతున్నాడా లేదా అన్న విషయం కాకుండా అసలు డ్రగ్ ఎడిక్ట్ ఎవరో తాను వెళ్లడిస్తా కాని వాటిని రాసే దమ్ము మీకుందా అని అంటున్నాడట. డ్రగ్స్ కేసులో సంబందించిన వారితో పరిచయాలు ఉన్నట్టు వస్తున్న వార్తలకు పూరి తీవ్రంగా ఖండించారట.

అంతేకాదు త్వరలోనే ఓ టివి ఛానెల్ ఇంటర్వ్యూకి పూరి అటెండ్ అవబోతున్నాడట. ఆ షోలో తాను అసలు డ్రగ్ ఎడిక్ట్స్ ఎవరు అన్నది వెళ్లడిస్తానని చెప్పాడట. పూరి చెప్పిన తీరు చూస్తుంటే నిజంగానే టాలీవుడ్ పెద్ద తలకాయలన్ని ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కునేట్టే ఉన్నాయి. మరి చెప్పే దమ్ము నాకుంది రాసే దమ్ము మీకుందా అని ఛాలెంజ్ చేస్తున్న పూరి అసలు విషయం ఎప్పుడు చెబుతాడా అని అందరు వెయిట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news