Newsజబర్దస్త్ ఆది అన్నంత పని చేశాడు.. ఏకంగా ఆమెని పెళ్లి చేసుకున్నాడు..

జబర్దస్త్ ఆది అన్నంత పని చేశాడు.. ఏకంగా ఆమెని పెళ్లి చేసుకున్నాడు..

జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయిన ఆది కొద్ది రోజులుగా ఓ నటిని ప్రేమిస్తున్నాడని వార్తలు వచ్చాయి. బి.టెక్ కంప్లీట్ అయిన ఆది అనుకోకుండా అదిరే అభి టీం లో చేరడం ఆ తర్వాత రాజు తో కలిసి సెపరేట్ టీంగా ఏర్పడటం తెలిసిందే. జబర్దస్త్ షోలో ఆది వేసే పంచులకు ఆడియెన్స్ అంతా కడుపు చెక్కలయ్యేలా నవ్వుతారు.

ఈ క్రేజ్ తోనే ఒక అమ్మాయిని ప్రేమించిన ఆది ఆమెని ఏకంగా పెళ్లి చేసుకుని కనిపించాడు. కొన్నాళ్లనుండి ఆది ప్రేమలో ఉండగా ఆ విషయాన్ని తన పెద్దలకు చెప్పాడట. అయితే తన ఇంట్లోనే కాదు అమ్మాయి తరపున వారు కూడా అభ్యంతరాలు తెలపడంతో కొద్ది రోజులు సైలెంట్ గా ఉండి ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారట.

కనీసం జబర్దస్త్ టీం మెట్స్ కు కూడా ఆది పెళ్లి విషయం చెప్పలేదంటే మనోడు ఎంత సీక్రెట్ గా వ్యవహారం నడిపించాడో అర్ధం చేసుకోవచ్చు. పెళ్లి సింపుల్ గా చేసుకున్నా రిసెప్షన్ మాత్రం అందరిని పిలిచి గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని చూస్తున్నారట. మొత్తానికి జబర్దస్త్ ఆది పెళ్లి వార్తతో అందరు అవాక్కవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news