Gossipsజూనియర్ ఎన్టీఆర్ విలనిజం తో ఇతర హీరోలకి భయం ?... వారిని...

జూనియర్ ఎన్టీఆర్ విలనిజం తో ఇతర హీరోలకి భయం ?… వారిని మించిన అంచనాలు

సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ‘విలనిజం’కు సంబంధించిన కొన్ని ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. పోస్టర్స్ లో విడుదల చేసిన లుక్ కు తోడు మరొక లుక్ ఈ లీక్ ఫోటోలలో కనపడుతోంది. చేతిలో గొడ్డలి పట్టుకుని, వికటాట్టహాసం ప్రదర్శిస్తూ తనలోని విలనిజంను చూపించే విధంగా ఉన్న ఈ స్టిల్స్ ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తున్నాయి.

బహుశా జూలై మొదటి వారంలో విడుదల కాబోతున్న టీజర్ లోని స్నాప్ షాట్స్ ను స్టిల్స్ రూపంలో ఇలా లీక్ చేసారా? లేక పోస్ట్ ప్రొడక్షన్ నుండి లీక్ అయ్యాయా? తెలియాల్సి ఉంది. అయితే వచ్చి రావడంతోనే అవి వైరల్ కావడంతో “జైలవకుశ” టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. స్టిల్స్ లో చూస్తుంటేనే జూనియర్ ఎన్టీఆర్ విలనిజం సినిమాకే హైలైట్ గా నిలిచేలా కనపడుతోంది.

ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల కాబోతున్న మహేష్ బాబు “స్పైడర్,” పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల సినిమాల రేంజ్ ను మించిపోయే అంచనాలు ఏర్పడేలా కనపడుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news