Newsనరసింహావాతారంలో ఎన్టీఆర్.. ఏ రికార్డుని ఆపలేరిక..!

నరసింహావాతారంలో ఎన్టీఆర్.. ఏ రికార్డుని ఆపలేరిక..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటనా ప్రతిభ గురించి తెలిసిందే.. ఈతరం స్టార్స్ లో అన్ని పాత్రలకు నప్పే ఏకైక హీరో తారక రాముడంటే నమ్మాల్సిందే సినిమా సినిమాకు తనలోని అద్భుత నటనా పటిమతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్న తారక్ ఇప్పుడు మరో ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడని అంటున్నారు. రుద్రమదేవి డైరక్టర్ గుణశేఖర్ మరో అద్భుత సినిమాకు శ్రీకారం చుట్టారట. ఆ సినిమానే హిరణ్యకశిపుడు.

రానా లీడ్ రోల్ లో నటించబోతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నృసింహావతారంలో కనిపించడానికి ఓకే అన్నాడట. రుద్రమదేవిలో గోన గన్నారెడ్డిగా ఛాన్స్ వచ్చినా వదులుకున్న తారక్ ఈసారి గుణశేఖర్ ఇచ్చిన అవకాశం వదులుకోవాలని అనుకోవట్లేదట. లీడ్ రోల్ రానాదే అయినా నరసింహుని అవతారంలో ఎన్.టి.ఆర్ కు మంచి ఎపిసోడ్ ఉంటుందని హామి ఇచ్చాడట గుణశేఖర్. ఈ ప్రాజెక్ట్ కు తారక్ దాదాపు ఓకే అన్నట్టు తెలుస్తుంది.

ఒకవేళ అదే నిజమైతే నరసింహావతారంలో తారక్ రికార్డుల సంచలనాలు సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు. యమదొంగ లాంటి సోషియో ఫ్యాంటసీలో నటించి మెప్పించిన యంగ్ టైగర్ ఈసారి నరసింహునిగా కూడా సత్తా చాటడం ఖాయమని ఫ్యాన్స్ ఇప్పటినుండే హడావిడి చేయడం మొదలుపెట్టారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news