Moviesఖైదీ నెంబర్ 150....ప్రి రిలీజ్ రివ్యూ...అధికారిక సమాచారం!!

ఖైదీ నెంబర్ 150….ప్రి రిలీజ్ రివ్యూ…అధికారిక సమాచారం!!

మెగాస్టార్ 150వ సినిమాకు కథ ఇవ్వాలని తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న రైటర్స్‌లో చాలా మంది ట్రై చేశారు. వాళ్ళు చెప్పిన కథలేవీ చిరంజీవికి నచ్చలేదు. చివరికి తమిళ్‌లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన ‘కత్తి’ సినిమాను రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడు చిరంజీవి. విశ్లేషకులు కూడా చిరు నిర్ణయాన్ని సమర్థించారు. అలాగే చాలా మంది డైరెక్టర్స్ కూడా ప్రయత్నాలు చేశారు. పూరీ జగన్నాథ్‌ అయితే ఆల్మోస్ట్ కన్ఫాం చేసుకున్నాడు కూడా. కానీ చివరలో ఎంట్రీ ఇచ్చిన వినాయక్ గోల్డెన్ ఛాన్స్‌ని కొట్టేశాడు. ఫైనల్‌గా చిరు సినిమా రిలీజ్‌కి రెడీ అయింది. సెన్సార్ సభ్యులతో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్, అలాగే కొంతమంది తెలుగు సినిమా పెద్దలు కూడా సినిమాను చూసేశారు. ‘ఖైదీ నెంబర్ 150’ ని చూసిన వాళ్ళ నుంచి మనకు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ రివ్యూ రిపోర్ట్ ఏంటంటే……?

ఖైదీ నెంబర్ 150 సినిమా చూసిన వాళ్ళకు రెండు విషయాలు బాగా గుర్తుండిపోతాయి. ఒకటి చిరంజీవి, రెండు రైతుల సమస్యలను మరోసారి ప్రపంచానికి చెప్పిన విధానం. ఈ రెండు అంశాలతోనే కంప్లీట్‌గా పైసా వసూల్ అయిపోతుందని చూసినవాళ్ళు చెప్తున్నారు. తొమ్మిదేళ్ళ తర్వాత ఎంట్రీ ఇచ్చినప్పటికీ డ్యాన్సులు, ఫైట్స్ విషయంలో చిరు జోష్, ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదని చెప్తున్నారు. ఠాగూర్ సినిమా స్థాయి ఎక్స్‌పెక్టేషన్స్‌తో సినిమాకు వెళ్ళొచ్చని చెప్తున్నారు. ఖైదీ నెంబర్ 150లో చిరుది డ్యూయెల్ రోల్ అన్న విషయం తెలిసిందే. రెండు క్యారెక్టర్స్‌ని అవలీలగా ప్లే చేశాడు చిరు. చిరంజీవి యాక్టింగ్ నుంచీ ఈ జెనరేషన్ హీరోలు నేర్చుకోవచ్చు అనే స్థాయిలో చిరు పెర్ఫార్మెన్స్ ఉంది. సినిమా స్టార్టింగ్ సీనే అదిరిపోతుందని తెలుస్తోంది. అలాగే డ్యూయెల్ రోల్‌ని రివీల్ చేసే విధానం …ఇంటర్వెల్ ఎపిసోడ్, క్లైమాక్స్ ఫైట్ అదిరిపోతుందట. మరీ ముఖ్యంగా కాయిన్‌తో మేజిక్ చేస్తూ చిరు చేసే ఫైట్‌కి మాత్రం క్లాప్స్ మోత మోగుతుందని చెప్తున్నారు. లారెన్స్ కంపోజ్ చేసిన ఐటెం సాంగ్‌లో చిరు డ్యాన్సులు విజిల్స్ కొట్టించడం ఖాయమట. చిరు స్టైలింగ్ కూడా అదిరిపోయిందని చెప్తున్నారు.

Also Read in English here : MegaStar Khaidi No 150 Movie Pre review

చిరంజీవి తర్వాత ఖైదీ సినిమా గురించి చెప్పుకోవాల్సి వస్తే రైతుల సమస్యలను చూపించిన విధానమే హైలైట్ అని తెలుస్తోంది. సమాజానికి సందేశం ఇవ్వడమంటే వినాయక్‌కి కూడా ఇష్టం. అందుకే ఆ సీన్స్ అన్నింటినీ కూడా హృద్యంగా తెరకెక్కించాడని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుందని చెప్తున్నారు. ఫొటోగ్రఫీ చాలా బాగుందట. ఓవరాల్‌గా రైతుల కథ, చిరంజీవిల కోసం ఈ సినిమాను కచ్చితంగా చూడాల్సిందే అనే రేంజ్‌లో సినిమా ఉంటుందని తెలుస్తోంది. పక్కా పైసా వసూల్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news