Newsఒక భార్య ఏడుగురు భర్తల కథ.. వింటే షాక్!

ఒక భార్య ఏడుగురు భర్తల కథ.. వింటే షాక్!

A Husband in Bangalore registered a case against his wife claiming that she already had seven other husbands and she is assaulting her. The man also complained about her brutal treatment on him.

సాధారణంగా మగాడి చేతిలో మోసపోయిన మహిళలు పోలీసులను ఆశ్రయిస్తుంటారు. కానీ తన భార్య తనను మోసం చేసిందంటూ ఓ విచిత్రమైన కేసు బెంగళూరులోని కేజీ హళ్లి పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పు బెంగళూరులోని కేజీ హళ్లి ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి తన భార్య యాస్మిన్ బానుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తనకు తెలియకుండా మరో ఏడుగురిని అంతకు ముందే పెళ్లి చేసుకుందని ఆమెపై ఫిర్యాదు చేశాడు భర్త. దీంతో పోలీసులు నోళ్లు వెల్లబెట్టారు.

నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నంలో వారికి విస్తురుపోయే అంశాలు ఎదురయ్యాయి. యాస్మిన్ భాను తమను కూడా పెళ్లి చేసుకుందని షోయబ్, అఫ్జల్ అనే మరో ఇద్దరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలేం జరుగుతుందో ఖాకీలకు అర్ధం కాలేదు. ఇక వీరికి తోడు మరో వ్యక్తి వచ్చి యాస్మిన్ తనను భారీ మొత్తంలో డబ్బులు అడిగిందని.. తాను ఇవ్వను అని ఖరాకండీగా చెప్పేయడంతో తనను వదిలి వెళ్లిపోయిందంటూ వచ్చాడు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. అఫ్జల్ తన భార్య చేసిన దురాఘాతాల గురించి ఎవరిని అడిగినా చెబుతారంటూ చెప్పాడు. యాస్మిన్‌కు మగవాళ్లను మోసం చేసే అలవాటు ఉందని, ఆమె తన మీద దాడి చేస్తోందని సదరు భర్త వాపోయాడు. చేసేది ఏమి లేక పోలీసులు యాస్మిన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఖిలాడీ భార్య మాత్రం ఏడుగురు భర్తలకు టోకరా వేసి పరారీలో ఉంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news