Movies రామ్ చరణ్‌ని కాఫీ షాప్‌లో ఓ ఆటాడుకున్న వైవా హర్ష.....

రామ్ చరణ్‌ని కాఫీ షాప్‌లో ఓ ఆటాడుకున్న వైవా హర్ష.. చూస్తే చెర్రీకి ఫ్యాన్ అవ్వాల్సిందే!

Ram charan has done a funny short film with chai bisket unit.

ఈమధ్య హీరోలందరూ యూట్యూబ్‌లో కూడా తమ సినిమాని బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు. యూట్యూబ్‌లో బాగా ఫేమ్ అయిన కొందరు స్టార్స్‌ని తీసుకుని, వారితో కామెడీ షార్ట్ ఫిల్మ్స్ తీయడమో, ఫన్నీ ఇంటర్వ్యూస్ చేయడమో చేస్తున్నారు. తాజాగా వీరి జాబితాలో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ కూడా చేరిపోయాడు. తన లేటెస్ట్ ఫిల్మ్ ‘ధృవ’ రిలీజ్ అవుతున్న సందర్భంగా.. ‘చాయ్ బిస్కెట్’ వారితో కలిసి ఓ ఫన్నీ వీడియో చేశాడు. ‘చాయ్ విత్ చరణ్’ పేరిట చేసిన ఆ షార్ట్ ఫిల్మ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.

ఆ వీడియో గురించి మాట్లాడుకుంటే.. కాసేపు రెస్ట్ తీసుకోవడం కోసం చరణ్ ఓ కాఫీ షాప్‌కి వస్తాడు. అక్కడే ఉన్న షార్ట్ ఫిల్మ్ యూనిట్ సభ్యులు.. వైవా హర్షని రామ్ చరణ్‌లా హిప్నాటిజమ్ చేసి, చరణ్ వద్దకు పంపిస్తారు. ఇద్దరి మధ్య నడిచే ఫన్‌తో ఓ వీడియో చేసి, యూట్యూబ్‌లో పెడితే తమకు ఎక్కువ వ్యూస్ వస్తాయని అలా చేస్తారు. ఇక హిప్నాటిజంలో ఉన్న హర్ష.. చరణ్ వద్దకు వెళ్ళి తిక్కతిక్కగా బిహేవ్ చేస్తాడు. చరణ్‌ని గుర్తించుకుండా అతనో సామాన్య వ్యక్తేననుకుని అతనితో పొగరుగా వ్యవహరిస్తాడు. కాఫీ గ్లాస్ లాక్కోవడం, వాచ్ చూసి ఒరిజినలా కాదా అని చెక్ చేయడం, తనకు ఫోన్ వస్తుంటే తీసుకోవడం లాంటివి చేస్తాడు. ఇలా చేసిన ప్రతిసారి చరణ్‌లో ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే.. గట్టిగా లాగి కొడతాడేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ.. చెర్రీ అందుకు ఎంతో కూల్‌గా స్పందిస్తాడు. వీరి మధ్య నడిచే ఈ ఎపిసోడ్ ఎంతో ఫన్నీగానూ, కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది.

నిజానికి.. హర్ష అడిగిన ప్రశ్నలు నిజజీవితానికి సంబంధించినవి. వాటికి చెర్రీ చెప్పిన సమాధానాలు వింటే.. హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తుంది. అంత అద్భుతంగా జవాబులు ఇచ్చాడు. గతంతో పోల్చుకుంటే.. అతను మాట్లాడే తీరులో కూడా చాలా మార్పు కనిపించింది. చాలా సాఫ్ట్‌గా, కూల్‌గా కనిపిస్తూ.. హుందాగా జవాబిలిచ్చాడు. ఈ వీడియో చూస్తే.. ఎవ్వరైనా చెర్రీకి ఫ్యాన్ అవ్వాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news