Gossipsషాకింగ్...షాకింగ్.. పవన్‌కి హ్యాండిచ్చేసిన త్రివిక్రమ్!!

షాకింగ్…షాకింగ్.. పవన్‌కి హ్యాండిచ్చేసిన త్రివిక్రమ్!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన కళ్యాణ్‌కి హ్యాండ్ ఇచ్చేశాడు. షాకవ్వకండి. అది పవన్‌తో చేయబోయే సినిమా విషయంలో కాదు. ఇంకో విషయంలో మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ‌్‌కి హ్యాండ్ ఇచ్చేశాడు త్రివిక్రమ్. ఆ మధ్య కాలంలో వీళ్ళిద్దరూ కలిసి సినిమా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకున్న విషయం గుర్తుందిగా.

అయితే పవన్ కళ్యాణ్‌ రాజకీయాలు, తీరిగ్గా పని చేసుకునే ఆయన విధానం కలిసి ఆ ప్రాజెక్ట్ ఇప్పటి వరకూ పట్టాలెక్కలేదు. అందుకే ఇక పవన్‌తో పెట్టుకుంటే పని అవదని చెప్పి త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంత ప్రయత్నాలు మొదలెట్టాడట. తన పేరు మీదే సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలు నిర్మించాలని ఫిక్స్ అయ్యాడట. ఆ సినిమాను అలా మొదలైంది ఫేం నందినీ రెడ్డి డైరెక్ట్ చేయనుంది. పెళ్ళి చూపులు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేయనున్నాడు. ఈ సినిమా స్టోరీ కూడా నందినీరెడ్డి స్టైల్‌లోనే లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్‌లో తెరకెక్కనుందని తెలుస్తోంది. అలాగే నిర్మాణ వ్యవహారాలతో పాటు రైటింగ్ సైడ్ కూడా త్రివిక్రమ్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. అందాల రాముడు సినిమా కోసం గంటలో 40 కామెడీ సీన్స్ రాసిచ్చిన చరిత్ర త్రివిక్రమ్‌కి ఉంది. నందినీరెడ్డి లాంటి డైరెక్టర్‌కి త్రివిక్రమ్ సపోర్ట్ చాలా హెల్ప్ అయ్యేదే. ఈ కాంబినేషన్ కూడా ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. ప్రొడ్యూసర్‌గా త్రివిక్రమ్ ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి. అంతా ఒకె కానీ మనవాడు పవన్‌కి ఎందుకు హ్యాండ్ ఇచ్చినట్టో.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news