Gossipsబాహుబలి కంటే ముందే ప్రభాస్ సినిమా?

బాహుబలి కంటే ముందే ప్రభాస్ సినిమా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చీమ చిటుక్కుమన్నా కూడా మీడియాకు ఆ విషయాలు తెలిసిపోతున్నాయి. ఇంతకుముందు బాహుబలి, బాహుబలి-2కి మధ్యలో మరో సినిమా చేయాలని ప్రభాస్ ప్లాన్ చేసుకున్నాడని మీడియా ఎప్పుడో రాసేసింది. రీసెంట్‌గా ప్రభాస్ కూడా ఇదే విషయాన్ని కన్ఫామ్ చేసేశాడు. అయితే బాహుబలి కంటే ముందు ఓ చిన్న సినిమాను రిలీజ్ చేయడం కరెక్ట్ కాదన్న ఉధ్ధేశ్యంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడట.

అయితే ఇప్పుడు అలాంటిదే మరో న్యూస్ బయటకు వచ్చింది. బాహుబలి-’ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని జక్కన్న చెప్పేశాడు. అంటే ఇప్పటి నుంచి ప్రభాస్ ఫ్రీ అన్నమాట. తెలుగు వరకూ చేసే ఏ సినిమా అయినా కేవలం ఓ ఐదు నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. ఆ విధంగా చూసుకుంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే కరెక్ట్‌గా మిర్చి రిలీజ్ అయిన టైంకి మరో సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి ప్రభాస్‌కి. మరి సుజిత్‌తో చేస్తున్న సినిమాను అలా తీసుకుని వస్తాడా? బాహుబలి-2 కంటే ముందు ఓ చిన్న సినిమాను రిలీజ్ చేస్తాడా? ప్రొడ్యూసర్స్ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ ప్రభాస్ అండ్ జక్కన్న మాత్రం దీనికి ఒప్పుకునే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆ చిన్న సినిమా ఫ్లాప్ అయిందంటే ఆ ఎఫెక్ట్ బాహుబలి పైన మామూలుగా ఉండదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news